నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది హైయెస్ట్ వ్యూస్ వచ్చిన టాప్ 5 సినిమాలు ఇవే..!

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా రిలీజ్ అయిన రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమవుతున్నాయి. అంతే కాదు.. థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే సినిమాలు చూసే ఆడియన్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. థియేటర్లలో రిజల్ట్ కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిజల్ట్ చాలా భిన్నంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ప్రస్తుతం భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న ప్రముక‌ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఒకటి. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది హైయెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Dhoom Dhaam Movie 2025 | Review, Cast, Trailer, Posters, Watch Online at ,  News & Videos | eTimes

ధూమ్ ధామ్ :
ప్రతీక్ గాంధీ, యామి గౌతమ్ కీలకపాత్రలో నటించిన ధూమ్ ధామ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 12.4 మిలియన్ వ్యూస్ దక్కించుకొని హైయెస్ట్ యూస్ సంపాదించిన టాప్ ఇండియన్ మూవీ గా మొదటి స్థానాని అందుకుంది.

పుష్పా 2
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కిన పుష్ప 2 సినిమా.. థియేటర్లలోనే కాదు నెట్‌ఫ్లిక్స్‌లోను సంచలనం సృష్టించింది. 9.4 మిలియన్ వ్యూస్‌ దక్కించుకొని ఇండియన్ మూవీస్ లోనే హైయెస్ట్ వ్యూస్ సాధించిన సినిమాగా రెండో స్థానాన్ని దక్కించుకుంది.

Bhool Bhulaiyaa 2 - Wikipedia

బూల్ భులియా 3:
ఈ సినిమాకు ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌లో 5.6 మిలియన్ న్యూస్ దక్కాయి. దీంతో ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాలు లిస్టులో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

Thaman: Daku Maharaj OTT update... Dolby sound system, Thaman tweets

డాకు మహారాజ్:
బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమా థియేటర్లో మంచి సక్సెస్ అందుకుంది. అంతే కాదు.. నెట్‌ఫ్లిక్స్‌లోను 5 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కించుకుని ఈ ఏడాది హైయెస్ట్ వ్యూస్ సంపాదించుకున్న ఇండియన్ సినిమాలలో నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకుంది.

Kadhalikka Neramillai (2025) - IMDb

కదలిక నేరమిల్లై:
ఈ సినిమాకు ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ఫారంలో 2.2 మిలియన్ వ్యూస్ దక్కాయి. దీంతో ఈ సినిమా ఐద‌వ‌ స్థానంలో కొనసాగుతుంది. ఇక రైఫిల్‌ క్లబ్, లక్కీ భాస్కర్, జిగ్ర సినిమాలు 6, 7, 8 వ స్థానాల్లో ఉన్నాయి.