టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ జనరేషన్ వాళ్ళకు ఆ పేరు తెలియకపోవచ్చు. కానీ.. 90స్‌కిడ్స్‌ను అడిగితే ఉదయ్ కిరణ్ రేంజ్, క్రేజ్ అర్థమవుతుంది. అప్పట్లో ఆయన సినిమాలు సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాలీవుడ్‌ను షేక్ చేశాడు ఉదయ్ కిరణ్. అతితక్కువ సమయంలోనే సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా రాణించి.. అంతే వేగంగా డౌన్‌ఫాల్ ఎదురుకున్నాడు. ఈ క్రమంలోని డిప్రెషన్ లోకి వెళ్లిన ఆయన.. సూసైడ్ చేసుకొని తనువు చాలించాడు. ఈ క్రమంలోనే.. ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ వినిపిస్తుంది. త్వరలోనే ఉదయ్ కిరణ్ బయోపిక్ స్క్రీన్ పైకి రానుందని సమాచారం.
నిజానికి ఎప్పుడో ఈ సినిమా రావాల్సింది. గతంలో డైరెక్టర్ తేజ కాబోయే అల్లుడు అనే టైటిల్ తో ఉదయ్ కిరణ్ బయోపిక్ అనౌన్స్ చేశాడు. కానీ.. కొన్ని కారణాలతో సినిమా పూర్తి కాకుండానే ఆగిపోయింది. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయాలంటే అందులో ఎన్నో కాంప్లికేషన్స్ కచ్చితంగా ఉంటాయి. ఈ క్రమంలోనే తేజ ఈ బయోపిక్ కాదని వదిలేసినా.. ఓ కొత్త డైరెక్టర్ బయోపిక్ పై ఫోకస్ చేశాడట. 2014లో ఉదయ్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత మెల్లమెల్లగా ఆయనను అంత మర్చిపోతూ వచ్చారు. అయితే తాజాగా ఓ షార్ట్ ఫిలిం డైరెక్టర్.. మరోసారి ఉదయ్ కిరణ్‌ను గుర్తు చేసుకున్నాడు. కొన్ని లఘు సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ఆయన.. ఓ భారీ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఉదయ్ కిరణ్ బయోపిక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
ఇందులో ఒక్క కుర్ర హీరో ఉడయ్ కిరణ్ పాత్రలో నటించనున్నాడు. నిజానికి ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తాడంటూ వార్తలు వినిపించినా.. తాను ఎలాంటి బయోపిక్ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఉదయ్ కిరణ్ను ఇండస్ట్రీకి చిత్రం సినిమాతో తేజ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత నువ్వు నేను తో గ్రాండ్ సపోర్ట్ ఇచ్చాడు. మనసంతా నువ్వే , శ్రీరామ్, నీ స్నేహం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉదయ్ కిరణ్‌ను స్టార్ హీరోగా మార్చాయి. తర్వాత ఉదయ్ కిరణ్ జీవితంలో అనుకొని సంఘటన కారణంగా డిప్రెషన్కు వెళ్లిపోయారు. అయితే చాలా వరకు ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనానికి సొంత తప్పిదాలే కారణమంటూ కామెంట్లు కూడా వినిపించాయి.
అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థమైన తర్వాత అది క్యాన్సిల్ కావడంతో.. చిరు కూడా ఆయనకు అవకాశాలు రాకుండా చేశాడనే అంటారు. ఇలాంటి క్రమంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ లో ఈ స్టోరీ అంతా చూపిస్తారా.. లేదా.. అనేది ఇండస్ట్రీలోను ఆసక్తిగా మారింది. బయోపిక్ చేయాల్సినంత గొప్ప సంఘటనలు ఉదయ్ కిరణ్ లైఫ్ లో పెద్దగా ఉండవు.. కానీ సినిమా చేయడానికి ఓ డైరెక్టర్ సిద్ధమయ్యాడంటే అందులో కాంట్రవర్సీలను కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంది. ఈ క్రమంలోనే చిరుతో పాటు పవన్, అల్లు అరవింద్ పాత్రలు కూడా దర్శకుడు చూపిస్తాడో లేదో వేచి చూడాలి.