టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు ఉమెన్స్ డే సందర్భంగా తల్లి అంజనాదేవి, చెల్లెలు విజయ దుర్గ, మాధవి లతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా తన చిన్ననాటి అన్ని విషయాలను గుర్తు తెచ్చుకున్నాడు చిరు. అమ్మ ఇచ్చిన ధైర్యం, ఫేవరేట్ ఫుడ్ చైల్డ్ మెమోరీస్ ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. చిరంజీవి నే ఎక్కువ అల్లరి చేసేవాడని అంజనాదేవి చెప్పగా.. అమ్మ నేను అల్లరి వాడిని కాదు హుషారుగా ఉంటా అంటూ చిరంజీవి సరదా కామెంట్స్ చేశారు. చలాకితనాన్ని అమ్మ అల్లరి అంటుందని వివరించాడు.
ఈ సందర్భంగా చిన్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటనను మెగాస్టార్ పంచుకున్నాడు. చిన్నప్పుడు నేను ఎక్కడికో పాక్కుంటూ వెళ్లిపోయా. ఒళ్లంతా మాసి రాసుకొని కూర్చున్న.. ఈ పిల్లాడు ఎవరని అంతా అనుకున్నారు. మా అమ్మ చూసి కూడా నన్ను గుర్తు పట్టలేదు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. మళ్లీ వెనక్కి వచ్చి చూసి నన్ను ఎత్తుకుంది అంటూ సరదాగా నవ్వులు పోయించాడు నాగబాబు. సోదరిమణులు, తల్లి అంజనా దేవితో ఉన్న బాండింగ్‌ను.. ఆమె ఇచ్చిన ధైర్యాన్ని షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ తన చెల్లి చనిపోయిన క్షణాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. అమ్మకు మేము 5 గురు అని అంతా అనుకుంటారు.. మరో ముగ్గురు తోబుట్టువులు నా చిన్నతనంలోనే చనిపోయారంటూ చెప్పుకొచ్చాడు.
నేను ఆరో తరగతి చదివే టైంలో నా చెల్లి రమా సడన్గా జబ్బు పడిందని.. అమ్మ, నేనే తనను హాస్పిటల్కు తీసుకువెళ్లం. నాన్నకు ఈ విషయం తెలీదు. అక్కడ ఆమె కన్నుమూయాగా తనను చేతుల్లోకి ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి.. చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో ఆమె అంత్యక్రియలు పూర్తి చేసాం. తర్వాత విషయం నాన్నకు తెలిసింది. ఆయనా వచ్చే సమయానికి అంతా అయిపోయింది. ఆ క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. తర్వాత అంజనమ్మ గురించి మాట్లాడుతూ.. ఆమె సలహాల వల్లే మేమంతా ఈ స్థాయిలో ఉన్నామని మెగాస్టార్ చిరంజీవి, చెల్లెలు విజయదుర్గ, మాధవిలు వివరించారు. జీవితంలో ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి.. ఎవరిపై ఆధారపడ కూడదనే ధైర్యాన్ని అమ్మ మాకు నేర్పిందని విజయదుర్గ వివరించారు.
అన్నయ్య వాళ్ళ దూరంగా ఉండడంతో అమ్మకు అన్ని పనులు నేనే చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇక మరో చెల్లెలు మాధవి మాట్లాడుతూ.. తాను తీవ్రమైన డిప్రెషన్ కి వెళ్ళినప్పుడు అమ్మ నాకు కొండంత ధైర్యం ఇచ్చిందని చెప్పుకొచ్చింది. ఎప్పుడు ఒంటరిగా ఫీల్ కావద్దని చెప్పిందని.. నాకోసం అమ్మ భరోసా ఎప్పుడు ఉంటుందని నమ్మకాన్ని కలిగించిందని వివరించింది. ఇక ఎంత కష్టం లో ఉన్నా.. ఎంత పెద్ద బాధ అయినా.. అమ్మకు హగ్గిస్తే అంతా పోతుందని నాగబాబు చెప్పుకొచ్చాడు. ముగ్గురిలో నేనే కాస్త వైలెంట్ ఇంట్లో భోజనం నచ్చకపోతే పెద్ద గొడవే. అన్నయ్య మాత్రం ఏది పెట్టిన సైలెంట్ గా తినేస్తాడు. కళ్యాణ్ బాబు మాత్రం భోజనం నచ్చకుంటే సైలెంట్ గా వెళ్లిపోయి నిరసన తెలిపేవాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా మెగా ఫ్యామిలీ అందరూ కలిసి ఉమెన్స్ డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఇంటర్వ్యూలో మిస్ అయ్యారు.