లేడీ గెటప్ లో ఉన్న ఈ బుడ్డోడు టాలీవుడ్ క్రేజీ హీరో.. గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో గత కొద్ది కాలంగా త్రో బ్యాక్ థీం తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ క్రేజీ హీరో లేడీ గెటప్ ఫొటోస్ వైరల్ గా మారాయి. ఇంతకీ లేడీ గెటప్‌లో.. క్యూట్ స్టిల్స్ ఇస్తున్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఇతను ఓ మెగా హీరో. మెగాస్టార్ సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి టాలీవుడ్ క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. చివరిగా ఓ బ్లాక్ బస్టర్‌తో సంచలనం సృష్టించిన ఆయన.. ప్రస్తుతం 100 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాలో న‌టిస్తున్నాడు.

ఆడ వేషంలో సుప్రీమ్ హీరో.. మదర్‌కు స్పెషల్ విషెస్ | sai Dharam Tej  Throwbacks Childhood Lady Getup Pic - Telugu Filmibeat

ఇంతకీ ఎవరో గుర్తుప‌ట్టారా. తనే సాయి ధరంతేజ్. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు.. విజయ దుర్గ త‌న‌యుడిగా.. తల్లి పేరును తన పేరుగా మార్చుకుంటూ సాయి దుర్గ తేజ్‌గా పేరు ఛేంజ్‌ చేసుకున్న ఆయన.. 2014లో పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. వైవిఎస్ చౌదరి మూవీతో సాయిధరమ్ తేజ్ హీరో కావాల్సి ఉండగా.. ఆయన నటించిన రేయ్ సినిమా డిలే కావడంతో.. పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక సాయిధరమ్ తేజ్‌కు మొదట బ్రేక్ ఇచ్చిన మూవీ సుప్రీం. ఈ సినిమా తర్వాత.. సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌లో ప్రతిరోజు పండగే, విరుపాక్ష లాంటి బ్లాక్ బ‌స్టర్ సినిమాలు పడ్డాయి. ఇక తర్వాత మేనమామ.. ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా నటించిన సంగతి తెలిసిందే.

SYG - Sambarala Yeti Gattu (2025) - Movie | Reviews, Cast & Release Date in  hyderabad- BookMyShow

తమిళ్ మూవీ వినోదయ సీతంకు రిమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సాయి ధరంతేజ్ సంబరాలు ఏటిగట్టు టైటిల్‌తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఏకంగా రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో రోహిత్ కేపీ దర్శకుడుగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ సెట్స్‌ వేసి.. షెడ్యూల్ పూర్తి చేస్తున్నారు టీం. ఇక ఈ సినిమాలో.. సాయి ధరమ్ తేజ్ జంటగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. అయితే ఓ కొత్త దర్శకుడిని న‌మ్మి ఇంత పెద్ద మొత్తంలో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారంటే.. కథ, స్క్రీన్ ప్లే పై టీంలో ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. ఇక్కడ సినిమా కోసం సాయి ధరంతేజ్ కూడా తన మేకోవర్‌ని పూర్తిగా చేంజ్ చేసేసాడు. సిక్స్ ప్యాక్‌తో వైల్డ్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు.