మహేష్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న తారక్ సెంటిమెంట్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడుగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న రాజమౌళి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన తెర‌కెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్ ఖ్యాతిని రెట్టింపు చేశాడు జక్కన్న. నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ను సంపాదించుకోవడమే కాదు.. టాలీవుడ్ సినిమాకు ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టిన ఘనత సైతం జక్కన్న కి సొంతం. ఇకపోతే.. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు జక్కన్న.. ఇటీవల మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తిచేసుకుని రెండవ‌ స్కేడ్యూల్‌ను ఒడిస్సాలో ప్రారంభించారు.

SSMB 29 launch: SS Rajamouli's film with Mahesh Babu kicks off with pooja  amid confusion over Priyanka Chopra's casting - Hindustan Times

మహేష్ కెరీర్‌లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమార్ విల‌న్‌గా కనిపించనున్నారని టాక్. మహేష్ తండ్రిగా నాన్న పటేక‌ర్‌ నటించినట్లు తెలుస్తుంది. అయితే వీటిపై అఫీషియల్ ప్రకటన రాకున్నా సినిమాకు సంబంధించిన ఏదో ఒక టాక్ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎస్ ఎస్ ఎం బి 29 నుంచి వస్తున్న ఓ న్యూస్.. మహేష్ ఫ్యాన్స్‌ను టెన్షన్ లో పడేసింది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో మహేష్ పాత్ర పేరు రుద్రా అని తెలుస్తుంది. ఇక మహేష్ సినిమాల్లో ఆయన నటించే పాత్రలు.. ఆ పాత్రల పేర్లు చాలా విభిన్నంగా.. తెలుగు సినిమా మార్క్‌ చూపిస్తూ ఉంటాయి.

Shakti (2011) - Movie | Reviews, Cast & Release Date in mumbai- BookMyShow

ఈ క్రమంలోని ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ పాత్రకు రుద్ర పేరు కూడా పవర్ ఫుల్ గా అనిపిస్తుంది. కానీ.. మహేష్ ఫ్యాన్స్ లో మాత్రం చిన్న టెన్షన్ మొదలైంది. రుద్ర నేమ్ నెగిటివ్‌గా అనిపిస్తుంద‌ని అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం తారక్ హీరోగా నటించిన శక్తి సినిమా. అందులో ఎన్టీఆర్ డ్యూయల్ పాత్రలో నటించగా.. వాటిలో ఓ రోల్ పేరు రుద్ర. మెహ‌ర్‌రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. అప్పట్లో భారీ అంచనాలతో రిలీజ్ ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే రుద్ర పేరును కొందరు మహేష్ ఫ్యాన్స్ అసలు ఇష్టపడడం లేదు. ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ఇలాంటి రోల్ నేమ్ అస్సలు సెట్ వ‌ద్ద‌ని.. నెగిటివ్గా అనిపిస్తుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇది దర్శకధీరుడు సినిమా.. ఒకవేళ క్యారెక్టర్ నేమ్ నిజంగా రుద్ర అయినా టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. కచ్చితంగా సినిమా కుంభ‌స్థలం బద్దలు కొట్టేస్తుంది. కథలో కంటెంట్ ఉంటే.. సినిమా బ్లాక్ బస్టర్ కాకుండా ఎవరు ఆపలేరు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.