టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జంటల్లో మహేష్ బాబు, నమ్రత పేర్లు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ బాబు ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో తెలిసిందే. ఆయన సతీమణి నమ్రత కూడా కెరీర్ మొదట్లో ఎక్కువ సంఖ్యల్లో సినిమాల్లో నటించి తన నటనతో సత్తా చాటుకుంది. అయితే.. మహేష్‌తో పెళ్లి తర్వాత రకరకాల కారణాలతో నమ్రత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత ఎన్నో సినిమాల ఆఫర్లు వచ్చిన ఆమె మాత్రం వరుసగా వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. మహేష్, రాజమౌళి కాంబో మూవీ సెట్స్‌కు సైతం నమ్రత హాజరు కాకూడదని వచ్చిన షరతులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. మహేష్ ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది.
ఇక తన పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన నమ్రత.. కెరీర్ పరంగా వాళ్ళు సక్సెస్ సాధించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. తన వంతుగా చేయవలసిన బాధ్యతలను హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తుంది. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి కాంబో మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో భారీ బడ్జెట్తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్.. ఫ్యామిలీలైఫ్ సైతం త్యాగం చేశాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహేష్ నటించిన ఎన్నో హిట్ సినిమాల సక్సెస్ కు కూడా నమ్రత ఎంకరేజ్మెంట్ ఏ కారణం అని తెలుస్తుంది.
ఇక మహేష్ బాబు రెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ.100 నుంచి రూ.120 కోట్ల రేంజ్‌కు పెరిగింది. ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న.. ఎస్ఎస్ఎంబి 29 కోసమే ఏకంగా ఐదేళ్లు కేటాయించనున్నారు. ఇక మహేష్ వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ వయసుతో సంబంధం లేకుండా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్‌లను కెరీర్‌లో ప్లాన్ చేసుకుంటూ రాణిస్తున్నాడు. మహేష్‌తో సినిమాలు తెరకెక్కించడానికి ఎంతో మంది దర్శక, నిర్మాతలు సైతం ఆసక్తి చెబుతున్నారు. ఇక తన సినీ లైఫ్ కోసం కష్టపడుతున్న మహేష్‌కు నమ్రత ఇస్తున్న ఎంకరేజ్మెంట్, కోపరేషన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ క్రమంలోనే నమ్రత లాంటి వైఫ్ దొరకడం మహేష్ కు నిజంగానే లక్కీ అంటూ.. ఈ జంట ఒకరి కోసమే ఒకరు పుట్టారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.