ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత అప్డేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సినిమాలకు సంబంధించిన, లేదా పొలిటికల్, ఇంక ఏ రంగానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలైనా.. ఎంత గోపియంగా ప్రజలకు తెలియకుండా ఉంచాలని ప్రయత్నించినా సరే.. అవి ఏదో ఒక లీక్‌ల రూపంలో క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు.. ఎలాంటి రంగం అయిన కూడా.. సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉంటున్నాయి. ఇలాంటి క్రమంలోనే.. టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా.. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాపై కూడా.. రోజుకో లీక్ వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు లుక్స్ వైరల్‌గా మారాయి.
ఇక ఈ సినిమా విషయంలో రాజమౌళి మొదటి నుంచి చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా లీక్ కాకూడదని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు సంవత్సర కాలం నుంచి రాజమౌళి ఎంతో స్పెషల్గా మహేష్ బాబు లుక్స్ పై కాన్సెంట్రేట్ చేసి ఆయన లుక్ ను హైడ్ చేసేందుకు ప్రయత్నించారు. అయినా.. సోషల్ మీడియాలో లీక్‌ల ప్రాబ్లం తప్పలేదు. కాగా ఇకపై సినిమాకు సంబంధించిన ఎలాంటి లీక్స్ బయటకు రాకూడదనే ఉద్దేశంతో.. రాజమౌళి సంచల నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ సెట్స్ లోకి నా తేవడం నిషేదించారు.
అంతేకాదు.. ఇకపై సినిమా షూటింగ్ సెట్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఎవరిని రానివ్వకుండా ప్లాన్ చేశారట. ముఖ్యంగా సెట్స్‌లో ఏ ఫోటో లీకైతే అక్కడ.. వర్క్ చేస్తున్న వాళ్ళ జాబ్స్ తీసేయడమే కాదు.. వాళ్లపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేలా రాజమౌళి షాకింగ్ డేసిషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి డెసిషన్ వైరల్‌గా మారడంతో అంతా షాక్ అవుతారు. మరీ అంతలా గోప్యంగా ఉంచి సినిమాను ఎందుకు రూపొందిస్తున్నారు.. అసలు ఏం జరగబోతుందని ఆసక్తి అభిమానులలో మొదలైపోయింది. అయితే ప్రస్తుతం జక్కన్న తీసుకున్న షాకింగ్ డెసిషన్.. లీక్‌ల నుంచి తప్పిస్తుందా.. లేదా.. ఇకపై సినిమా నుంచి వచ్చే లీక్స్ ఆగిపోతాఏమో చూడాలి.