మూడు పండగలకు మూడు సినిమాలు..తారక్ స్పీడుకు నో బ్రేక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆర్‌ఆర్ఆర్, దేవర లాంటి రెండు పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్‌ల‌ను అందుకున్న తారక్.. ఫ్యూచర్ ప్లాన్ అంతకుమించేలా ఉండ‌నుంద‌ట‌. తారక ఈసారి ధియేటర్లలో ర‌చ్చ మాములుగా ఉండ‌ద‌ని.. ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ అసలు తారక్ ప్లాన్ ఏంటి.. వచ్చే ఫెస్టివల్స్ లో ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న తారక్.. వరుసగా రానన్న మూడు సినిమాలను.. మూడు పండుగలకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే తాజాగా వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.

Release date locked for NTR, Hrithik Roshan multistarrer 'War 2'

అయితే.. ఈ సినిమా తుది రాసుకు చేరుకుంది. ఇంకో వారం రోజులతో పూర్తి షూట్ ను కంప్లీట్ చేసి.. చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌ని కూడా ముగించేసి.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ చేస్తున్న మరో సినిమా డ్రాగన్. ప్రశాంత్ నీల్‌ డ్రాగన్ సెట్స్‌లోకి ఏప్రిల్ నుంచి తారక్ ఎంట్రీ ఇవ్వనన్నాడు. ఈ ఏడాది నవంబర్లో సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు తారక్. 2026 సంక్రాంతి బరిలో ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఎట్టి పరిస్థితిలో తమ ఎస్టిమేషన్ను టైం కు రీచ్ అయ్యే లక్ష్యంతో టీం మొత్తం దూసుకుపోతున్నారు మేకర్స్‌. అలా.. వచ్చేయడాది సంక్రాంతి బరిలో డ్రాగన్ రావడం పక్కా అని సమాచారం. ఇక తార‌క్ లైన‌ప్‌లో ఉన్న మ‌రో ప్రాజెక్ట్ దేవర 2. ఇప్ప‌టికే ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్‌గా ఎలాంటి సక్సెస్ అందుకుందో చూసాం.

ఈ క్రమంలోనే సెకండ్ పార్ట్ పై.. దేవర మొదటి భాగంలో ఉన్న ఎన్నో చిక్కు ప్రశ్నలకు.. రెండో భాగంలో సమాధానం దొరికేలా.. అది కూడా ఆడియన్స్‌ను అద్యంతం ఆకట్టుకునేలా.. ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో రూపొందించనున్నాడ‌ట‌ కొరటాల. ఈసారి సైఫ్ అలీ ఖాన్‌తో పాటు సినిమాలో విలన్‌గా బాబి డియోల్ కనిపించనున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే కాస్టింగ్ వివరాలు మాత్రం రివీల్ చేయడం లేదు టీం. మరోపక్క జాన్వి కపూర్ డేట్స్ కూడా ఇవ్వడం లేదని.. అంతా సవ్యంగా అనుకున్నట్లు జరిగితే జనవరి కల్లా ఈ సినిమా షూట్‌ను పూర్తిచేసి 2026 దసరా బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం కొరటాల తన టీంతో కలిసి దేవర 2 స్క్రిప్ట్‌ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. జూన్ నాటికి స్క్రిప్ట్ పూర్తయిపోతుందని చెబుతున్నారు. తర్వాత.. ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నరట టీం. ఇలా.. మొత్తానికి ఎన్టీఆర్ మూడు పాన్ ఇండియా సినిమాలను మూడు పండగలకు రిలీజ్ చేసేలా ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పట్లో తారక్ స్పీడ్‌కు బ్రేక్ పడడం కష్టమే అనడంలో అతిశయోక్తి లేదు.

Film «Devara: Part 2» 0000 — ACMODASI