టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా విక్టరీ వెంకటేష్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ అందుకొని ఏకంగా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టిన వెంకటేష్ కు ఘోర అవమానం ఎదురయింది. ఓ రైటర్ తాజాగా వెంకటేష్‌ను డమ్మీ పీస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆ రైటర్ ఎవరు.. ఎందుకు అంతలా వెంకటేష్‌ను అవమానించాడు ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది డైరెక్టర్లు, లేదా రైటర్లు సినిమా స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు స్టోరీ నచ్చితే కచ్చితంగా వాళ్ల తండ్రికి.. లేదా మేనేజర్లకు కథ వినిపించమని చెబుతారు. వాళ్ళకి కూడా నచ్చితే సినిమా నటిస్తారు.
ఒకవేళ వాళ్లకు కథ నచ్చకుంటే సినిమా సెట్స్ పైకి రాదు. ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో చాలా కామన్. కానీ.. వెంకటేష్ దగ్గర కూడా ఓ రైటర్ కి ఇలాంటి అనుభవం ఎదురవడంతో తాజాగా ఆ అక్కసును రైటర్.. వెంకటేష్ పై చూపించాడు. ఇంతకీ ఆ రైటర్ ఎవరో కాదు బెజవాడ ప్రసన్నకుమార్. ఇప్పటివరకు తాను రైటర్ గా వ్యవహరించిన ఎన్నో కథలను సినిమాలుగా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాయి. వాటిలో ధమాకా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, హలో గురు ప్రేమకోసమే, నా సామిరంగా, నేను లోకల్, మజాకా ఇలా ఎన్నో సినిమాలున్నాయి. అయితే ఓ సారి వెంకటేష్‌తో ఓ సినిమా చేద్దామని.. కథ వినిపించడానికి ప్రసన్న కుమార్ వెళ్ళాడట. కథ వెంకటేష్‌కు నచ్చిందని.. సురేష్ బాబుకి కథ చెప్పమని వివరించాడట.
దీంతో సురేష్ బాబుకు కథను వినిపించాడట ప్రసన్నకుమార్. కానీ.. సురేష్ బాబుకి కథ నచ్చకపోవడంతో నాకు నచ్చలేదని.. మొహంపై చెప్పేసాడట. ఈ క్రమంలోనే వెంకటేష్‌కు నచ్చిన ఇద్దరు అన్నదమ్ములు.. ఒక మాట అనుకొని సినిమా చేయడానికి ఇష్టపడలేదట. అలా డేట్స్ కోసం వెళ్లిన ప్రసన్నకుమార్‌కు అంతలా అవమానం జరగడంతో.. అప్పటినుంచి వెంకటేష్ కథలు చెప్పడం మానేశాడట ప్రసన్నకుమార్. ఆయనతో సినిమాలు చేయను అంటూ రీసెంట్గా ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇలాంటి క్రమంలో ప్రసన్నకుమార్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో.. వెంకటేష్ అన్న చెబితేనే చేస్తాడు.. ఆయనకు కథల సెలక్షన్ కూడా రాదు.. ఆయన డమ్మీ పిస్ అంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ప్రసన్నకుమార్.. వెంకటేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.