ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి పాత్రలోనైన పరకాయ ప్రవేశం చేసి.. అవలీలగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోగా ఎన్టీఆర్‌కు తిరుగులేని ఇమేజ్ క్రియేట్ అయింది. కేవలం నటన పరంగానే కాదు.. డ్యాన్స్‌తోను ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు తారక్. నందమూరి తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తాతకు తగ్గు మనవడిగా రాణిస్తున్నాడు. బాల్యంలోనే రాముడు పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. చివరిగా వచ్చిన ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో వరుసగా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లు అందుకని సత్తా చాటుకున్నాడు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించేందుకు ఎంతో మంది ముద్దుగుమ్మలు అరటపడుతున్నారు. అంతేకాదు.. స్టార్ డైరెక్టర్స్ సైతం.. ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ఇష్టపడతారు. రెండు పేజీల డైలాగ్‌లు కూడా.. ఒక్కసారి చదివి చెప్పగల తారక్ డెడికేషన్, ప్రాక్టీస్ లేకుండా.. ఒక్కసారి చూసి ఎలాంటి డ్యాన్స్ స్టెప్ అయినా చేయగల కెపాసిటీ ఉన్న ఏకైక హీరోగా.. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటన, డ్యాన్స్‌తో పాటు సింగర్‌గా మారి.. తన పాటలతో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు ఎన్టీఆర్. అలాంటి తారక్ ముగ్గురు నటులతో మాత్రం.. సినిమా చేయడానికి చాలా కష్టపడిపోతారట. టేకుల పైన టేకులు తీసుకుంటాడట. ఇంతకీ ఆ నటులు ఎవరో.. అంతలా కష్టపడ్డడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
ఆ స్టార్ సెలబ్రెటీస్ మరెవరో కాదు.. బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్ వీళతో కలిసి కామెడీ సీన్స్ చేసేటప్పుడు.. ఎంత నవ్వు ఆపుకోవాలని ప్రయత్నిస్తున్న నవ్వు వచ్చేస్తుందని.. దాన్ని కంట్రోల్ చేసుకోలేనని.. దానివల్ల ఎక్కువగా టేక్స్ తీసుకోవాల్సి వస్తుందని స్వయంగా చెప్పుకొచ్చాడు. బృందావనం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కమెడియన్ వేణుమాధవ్.. ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఇక హీరోయిన్స్ తో కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయా.. ఉంటే ఆ హీరోయిన్లు ఎవరిని.. వేణుమాధవ్ ప్రశ్నించగా హీరోయిన్స్ తో నాకు సమస్య ఉండదని.. టేక్స్ తీసుకొనని చెప్పుకొచ్చాడు. ఈ న్యూస్ ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారుతుంది.