టాలీవుడ్ కింగ్ నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్‌కు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఒక్క సినిమాతో కూడా హిట్ కొట్టలేకపోయాడు అఖిల్. ఈ క్రమంలోని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక అఖిల్ నుంచి చివరిగా వచ్చిన ఏజెంట్ సినిమా రిజల్ట్ అంతా చూశాం. 2023 ఏప్రెల్ 28న రిలీజైన ఈ మూవీ ఘోర డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్‌తో అక్కినేని అఖిల్.. చాలా కాలం సినిమాలకు దూరమయ్యాడు.
అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్టును అనౌన్స్ కూడా చేయలేదు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అఖిల్ పగలబందీగా ప్లాన్ చేశాడని.. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో కొడుకు అఖిల్‌ను ఎలాగైనా సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురావడానికి అమల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. స్టార్ డైరెక్టర్‌ను సంప్రదించారట. అతను మరెవరో కాదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని తెలుస్తుంది. అఖిల్‌కు మెంటర్గా ప్రశాంత్ నిల్‌ను ఉండమని అమలా రిక్వెస్ట్ చేసిందట.
ఇకపై అఖిల్ తీయబోయే సినిమాలు, సినిమాల కథల విషయాల్లో.. ఇతర ఇతర విషయాలలో ప్రశాంత్ జోక్యం ఉండబోతుందని అంటున్నారు. అమల రిక్వెస్ట్ చేయడంతో ప్రశాంత్ నీల్ కూడా దానికి ఒప్పుకున్నారట. ఇకనుంచి అఖిల్ సినిమాలకు సంబంధించిన విషయాలు ప్రశాంత్ నీల్ దగ్గరుండి చూసుకోబోతున్నడని.. అఖిల్‌ను ట్రాక్‌లో పెట్టె భాధ్యత తీసుకున్నాడంటూ టాక్ నడుస్తుంది. ఈ క్రమంలేనే అఖిల్ నటించబోయే సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటే చాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.