సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: రీ రిలీజ్ లో మాస్ జాతర చేస్తున్న క్లాస్ మూవీ..!

ఇండస్ట్రీలో ఎంత చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. స్టార్ హీరో నటించిన, కొత్త వాళ్లు నటించిన సినిమా అయినా.. బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుండి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే మేకర్స్కు కనక వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోని తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు మరోసారి పట్టంకట్టుకున్నారు. దాదాపు 13ఏళ్ల‌ క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో జనాలను ఆకట్టుకుంది. కానీ గొప్ప కమర్షియల్ సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. అప్పుడు రావాల్సినంత మైలేజ్ రాకున్నా కానీ.. ఇప్పుడు థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి దూసుకుపోతుంది.

Watch Seethamma Vakitlo Sirimalle Chettu Full movie Online In HD | Find  where to watch it online on Justdial

ఈ సినిమా టీవీలో ఇప్పటికి ఎన్నో వందలసార్లు రిలీజ్ అయిన.. ఆన్లైన్లో హెచ్డి క్వాలిటీ లో ఫుల్ మూవీ అందుబాటులో ఉన్న సరే.. రీ రిలీజ్‌ ఊపు మాత్రం మామూలుగా లేదు. ఈ క్లాసికల్ మూవీ ప్రస్తుతం టాలీవుడ్‌లో మాస్ జాతర చేస్తుంది. మహేష్, వెంకీ ఫాన్స్‌తో థియేటర్స్ కలకలలాడిపోతున్నాయి. మహేష్ ని వెండితెరపై చూసుకొని ఏడాది గడిచింది. పైగా.. పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా చూసి కూడా చాలా సమయం అయింది. ఈ క్రమంలోనే అభిమానులు క్లాసికల్ మూవీని చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్ షోస్ అని హౌస్ ఫుల్ అయిపోయాయి.

Seethamma Vakitlo Sirimalle Chettu telugu Movie - Overview

కొన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే రేంజ్ లో జ‌న తాకిడి ఉంది. చాలా కాలంగా మహేష్ ఫ్యాన్స్ కూడా సినిమా రిలీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్లలో సరైన సినిమా కూడా లేకపోవడంతో మరోసారి దిల్ రాజుకు కాసుల వర్షం కురుస్తుంది. ఎంతైనా దిల్ రాజు సరైన సమయం చూసుకొని సినిమాను దింపాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సీన్, డైలాగ్‌కు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సాంగ్స్ టైంలో అయితే సీట్లలో కూర్చోకుండా చిందులేస్తున్నారు. ముఖ్యంగా సీన్స్ రీ క్రియేట్ చేస్తూ తెగ సంబరాలు చేసేసుకుంటున్నారు. ఫోన్లో మాట్లాడే సీన్స్.. పూల కుండీలు తన్నేసీన్ ఇలా చెప్పుకుంటే పోతే సినిమాకు ఐకానిక్ సీన్లుగా ఉన్న అన్నింటిని రీ క్రియేట్ చేస్తూ దించేస్తున్నారు. ఓ సినిమాకు వెళ్లినట్లు కాకుండా.. ఏదో సెలబ్రేషన్స్కు వెళ్ళినట్లు అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.