పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు షూటింగ్ షూరు.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటి సిఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లో అప్పుడప్పుడు డేట్స్ ఇస్తూ మెల్లమెల్లగా షూట్ ను పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్‌తో సినిమా అంటే.. ఎన్నేళ్లు గడపాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ సినిమాను స్టార్ట్ చేయడమే కానీ.. పూర్తి మాత్రం చేయడం లేదు. దీంతో దర్శక,నిర్మాతులకు మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్లు సరిపోతున్నాయి. ఆయన ఎప్పుడు షేట్‌కు వస్తాడో తెలియదు.. ఎప్పుడు షూట్ను ఆపేస్తారో తెలియదు. ఎప్పుడు సెట్స్ కు అడుగుపెడతాడో.. ఎప్పుడు రెడీగా ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలోనే వాళ్ళు తీసిన సీన్స్ అన్నిటిని అతికించుకుంటూ కూర్చోవడం దర్శకులకు పెద్ద తలనొప్పి అయిపోతుంది.

అయినా అన్నిటికి సిద్ధమయ్యే సినిమాలకు ఒప్పుకుంటున్నారు. పవన్ రావడానికి ఆలస్యమైన ఆయనతోనే షూట్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. తాజాగా హరిహర వీరమల్లు విష‌యంలోను అదే జ‌రుగుతుంది. కొద్ది గంటల క్రితం సినిమా కొత్త స్కెడ్యూల్ ప్రారంభించారు. మార్చి 28న సినిమా రిలీజ్ అని చెప్తున్నారు. అయితే పవన్ సినిమాలు చెప్పిన టైంకి రిలీజ్ కావడం అనేది అసాధ్యమే. తాజాగా.. హరిహర వీరమల్లు కొత్త స్కెడ్యూల్ తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రారంభించారు. అక్కడే ఎందుకంటే.. పవన్‌కి కన్వీనియంట్‌గా ఉంటుంది. సమయం సేవ్ అవుతుంది. ఒకవేళ ఆయన డేట్ ఇచ్చిన ఎక్కువ టైం ట్రావెల్ చేసే సమయం ఉండకపోవచ్చు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ఆఫీసులో మంగళగిరి సమీప ప్రాంతంలోనే షూటింగ్ను పూర్తి చేసేయాలని పవన్.. దర్శక, నిర్మాతలకు కండిషన్ పెట్టినట్లు.. వారు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా తాడేపల్లిలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం సత్యరాజ్, ఈశ్వరి రావులపై కొన్ని సీన్స్ రూపొందిస్తున్నాడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. ఇదే స్కెడ్యూల్ లో పవన్ కూడా పాల్గొంటారని టాక్. కాకపోతే ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటి తర్వాత కానీ పవన్ వీరమల్లు షూటింగ్ సెట్స్ లో పాల్గొనడం అసాధ్యం. అప్పటివరకు వాళ్ళు వెయిట్ చేయక తప్పదు. ఇక పవన్ పోర్షన్ ఎంతో లేదు. కేవలం నాలుగు రోజుల కేటాయిస్తే సినిమా పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే పవన్ ఇప్పట్లో షెడ్యూల్ కు వస్తాడా.. లేదా.. అనేది బిగ్ ట్విస్ట్ గా మారిపోయింది.