ఏదైనా సినిమా రూపొందించి సక్సస్ కొట్టాలంటే సరైన కంటెంట్‌తో పాటు.. మంచి ఫాంటసీ టచ్తో పాటు మైథాలజికల్ టెచ్ తోడైతే చాలు ఇక సినిమాకు తిరుగు ఉండదు. ఇప్పటికే కార్తికేయ 2, హనుమాన్, కల్కి లాంటి సినిమాలు దీనిని ప్రూవ్ చేశాయి. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం హీరో నిఖిల్ నటిస్తున్న మూవీ స్వయంభు. సోషియ ఫాంటసీ డ్రామాగా ఠాగూర్ మధు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
నిఖిల్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. భరత్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా లైన్, స్టోరీ, బ్యాగ్రౌండ్ ఏది బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే సీజీ వర్క్స్ మాత్రం భారీగా ఉండనున్నాయని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో రామసేతు ఎపిసోడ్ కూడా ఉండిపోతుందట. అత్యంత కీలకంగా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని.. సినిమాలో ఎపిసోడ్ వచ్చేటప్పుడు ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చేలా సీన్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.
భారత్, శ్రీలంక మధ్య శ్రీరాముడు నిర్మించిన వారధి రామసేతు. ఇది పుక్కిటి పురాణం కాదని.. సముద్ర గర్భంలో రామసేతు అవశేషాలు.. ఆనవాళ్లు ఇంకా ఉన్నట్లు కూడా రుజువైంది. దీని మీద బోలెడన్ని పరిశోధనలు, పుస్తకాలు రిలీజ్ అయ్యాయి. ఇలాంటి క్ఉరమంలో స్వయంభూ సినిమాలో ఇప్పుడు ఈ రామసేతుకు సంబంధించిన సీన్లు కొన్ని ఉండనున్నట్లు టాక్. ఇది వాస్తవమైర సినిమాపై మరింత బజ్ నెఓలకొనడం కాయం. ఇక ప్రొడశ్రీన్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత.. సిజీ వర్క్స్ జరుగుతున్నాయి. మే లో లేద జూన్‌లో ఈ సినిమాను గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారట టీం.