కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టికి టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ సినిమాగా రిలీజ్ అయిన కాంతరతో దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకోవడమే కాదు.. అన్ని భాషల్లో డబ్బింగ్ మూవీ రిలీజ్ చేసి.. ప్రతి చోట బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే సినిమాలో రెండు వైవిద్యమైన పాత్రల్లో నటిస్తూ రిషబ్ శెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విపరీతమైన పాపులారిటి దక్కించుకోవడమే కాదు.. కాంతార తో చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలోనే రిషబ్ శెట్టికి సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే ఇప్పటికే రిషబ్‌కు పెళ్ళై.. పిల్లలు ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన భార్య ప్రగతి శెట్టిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 2016లో ఓ సినిమా ఈవెంట్లో ప్రగతి శెట్టిని మొదటిసారి చూసిన రిషబ్ శెట్టి.. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయారట. తర్వాత ఆమె కోసం ఫేస్‌బుక్‌లో వెతుకుతున్న క్రమంలో ప్రగతి శెట్టి.. స్వయంగా రిషబ్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది.
అలా ఫుల్ హ్యాపి అయిన రిషబ్ వెంటనే రిక్వస్ట్ ఏక్సప్ట్ చేసి.. ఆమెతో మాట్లాడుతూ ఉండే వాడు. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడడం.. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. రిషబ్ శెట్టిని అల్లుడుగా చేసుకునేందుకు ప్రగతి ఫ్యామిలీ అసలు ఒప్పుకోలేదట. అయినా రిషబ్ శెట్టిపై ఉన్న ప్రేమతో.. ప్రగతి పట్టుబట్టి మరీ అతనిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వీరికి ఓ కొడుకు, కూతురు జన్మించారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.