ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ కలిగిన స్టార్ కిడ్స్ర, స్టార్ సెలబ్రిటీస్.. ఇష్టాఇష్టాలు, లైఫ్ స్టైల్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ఎంతో మంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు, స్టార్ కిడ్స్ ఫేవరెట్ హీరో ఎవరని చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు.. వారి రిలేటివ్స్ లో లేదా వారి తండ్రి, తాతల పేర్లు చెబుతూ ఉంటారు. కానీ.. మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని మాత్రం అందరికంటే యునిక్‌గా ఉంటుంది. తాను ఏమనుకుంటే అదే చెప్తుంది. ఏది ఫీల్ అయితే దానిని ఓపెన్ గా అనేస్తూ ఉంటుంది.
ఇక అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలోను భారీ పాపులారిటీ దక్కించుకున్న సితార ఘట్టమనేని.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. అయితే సితార డ్రీమ్ మాత్రం ఫ్యూచర్‌లో ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగడమే నట. ఆమెకు నటనపై ఆసక్తి ఉందని.. పలు సందర్భాల్లో వివరించింది. అయితే ప్రస్తుతం సితార ఘట్టమనేని చదువుపై కాన్సన్ట్రేట్ చేస్తుంది. మహేష్ బాబుకు చదువును ఆపి సినీరంగంలోకి తీసుకురావడం ఇష్టం లేక.. ఆమె చదువు పూర్తయిన తర్వాతే తన ఇష్టమైన రంగంలో రాణించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నా మహేష్ బాబు మాత్రం వాటిని హోల్డ్ లో పెడుతున్నట్లు సమాచారం.
ఇలాంటి క్రమంలోనే.. సితార ఫేవరెట్ హీరో ఎవరు.. ఆమె ఇష్టలు ఏంటని తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అందరిలాన్నే సితార ఘట్టమనేని ఫేవరెట్ హీరో కూడా తన తండ్రి మహేష్ బాబుఅట. కానీ.. మహేష్ బాబు కాకుండా ఆమెకు అంతలా నచ్చే హీరో ఎవరు అంటే మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తుంది. ప్రభాస్ కటౌట్‌తో పాటు.. ఆయన నటన కూడా సితారకు చాలా చాలా ఇష్టమట. అంతేకాదు ప్రస్తుతం ఇతర తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్.. ఇన్‌సప్టాలో ఫాలో అయ్యే ఏకైక హీరో కూడా ప్రభాస్ కావడం విశేషం. ఈ క్రమంలోనే సితార టేస్ట్ అదుర్స్ అంటూ.. ప్రభాస్ అంటే నచ్చని వారు ఎవరు ఉండరు అంటూ.. సితార చాలా యూనిక్.. మంచి టేస్ట్ అంటూ.. ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.