టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో వెంకటేష్ తన నటనతో ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి సినిమాకు హీరోయిన్‌లుగా నటించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో.. జనవరి 14న రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
అంతేకాదు.. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్ల కొల్లగొట్టి.. వెంకటేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాస్ తెచ్చిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇలాంటి క్రమంలో.. వెంకటేష్ నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడు తో చేయబోతున్నాడని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బన్నీ తన నెక్స్ట్ సినిమా ఛాన్స్ ను ఓ ఫ్లాప్ డైరెక్టర్ కు ఇచ్చాడట. గతంలో స్టార్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుని రాణించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు మాత్రం ఘోరమైన డిజాస్టర్లను చూస్తున్నాడు.
ఇలాంటి క్రమంలో వెంకటేష్ అతనికి ఛాన్స్ ఇచ్చాడని తెలియడంతో నెటింట హాట్ న్యూస్ గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ దర్శకుడు పేరు చెప్పలేదు కదా.. తనే సురేందర్ రెడ్డి. గతంలో ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించిన ఆయన.. చివరగా అఖిల్.. ఏజెంట్ సినిమాతో ఘోర డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఎలాంటి క్రమంలో ఆయన వెంకటేష్ తో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా దానికోసం వెంకటేష్ ను కలిసి కథను కూడా వినిపించాడని.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే.. దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందట.