ఇండస్ట్రీలో ఏ సినిమా రావాలన్నా సరే కచ్చితంగా మొదట హీరో ఎవరని అడుగుతారు. సినిమా వాల్ పోస్టర్ క్రౌడ్ పుల్లరుగా నిలిచేది కూడా హీరో. హీరో పాత్రలకే సినిమాలో మెయిన్ ప్రాధాన్యత. ఈ క్రమంలో కచ్చితంగా హీరో రోల్ చనిపోయినప్పుడు ఆడియన్స్ అసలు ఒప్పకోరు. కొన్ని సినిమాల్లో హీరో చనిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే హీరో పాత్రలు చనిపోయిన కూడా కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాంటి తెలుగు మూవీస్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
గమ్యం:
అల్లరి నరేష్, శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. 2008లో వచ్చిన ఈ సినిమాలో అభిరాం పాత్రలో శర్వానంద్, గాలి శీను పాత్రలో అల్లరి నరేష్ నటించగా.. సినిమాలో గాలి శీను పాత్ర మరణిస్తాడు.
నేనే రాజు నేనే మంత్రి:
టాలెంటెడ్ డైరెక్టర్ తేజ తర్కెక్కించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా, కాజల్ అగర్వాల్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో హీరోయిన్ కాజల్, హీరో రానా ఇద్దరి రోల్స్ చనిపోతాయి.
మేజర్:
అడవి శేష్ హీరోగా.. శశికిరణ్ తిక్క డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో టెర్రరిస్ట్ ఎటాక్ లో అడవి శేషు రోల్ మరణిస్తాడు.
నిన్నే ప్రేమిస్తా:
నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాకు ఎస్.ఏ. రాజకుమార్ దర్శకత్వం వహించారు. 2000 లో వచ్చిన ఈ సినిమా లో బస్సు ప్రమాదంలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించిన నాగార్జున మరణిస్తాడు.
బాహుబలి:
పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాహుబలిలో ప్రభాస్ హీరోగా నటించిన.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ 2015లో తెరకెక్కింది. బాహుబలి ది బిగినింగ్లో బాహుబలి రోల్‌ను కట్టప్ప వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు.
వేదం:
అల్లు అర్జున్, మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. 2017 సినిమాల్లో ఉగ్రవాదుల నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు హీరోలు చనిపోతారు.
ఎవడే సుబ్రహ్మణ్యం:
విజయ్ దేవరకొండ, నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వం వహించాడు. 2017 లో వచ్చిన ఈ సినిమాల్లో.. రిషి పాత్రలో విజయ్ దేవరకొండ మరణిస్తాడు.
చక్రం:
ప్రభాస్ హీరోగా, కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఈ సినిమా 2005లో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రిజల్ట్ అందుకుంది. అయితే ఈ సినిమాలోని ప్రభాస్ చక్రం రోల్ లో.. బ్లడ్ క్యాన్సర్ కారణంగా చనిపోతాడు.
భీమిలి కబడ్డీ జట్టు:
నాని హీరోగా.. తాతినేని సత్య డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో కబడి క్లైమాక్స్‌లో నాని రోల్ చనిపోతుంది.
జెర్సీ:
నాని హీరోగా.. గౌతం తిన్ననూరి డైరెక్షన్లో 2019లో తెరకెక్కిన సినిమా క్లైమాక్స్.. క్రికెట్ మ్యాచ్ తర్వాత హీరో కుప్పకూలి మరణిస్తాడు.