బోళ్ళ శంకర్ లాంటి ఘోర డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ విశ్వంభర. సోషియ ఫాంటసీ డ్రామాగా భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై మొదట ఆడియన్స్‌లో మంచి అంచనాలే ఉన్నా.. గతేడాది రిలీజ్ అయిన టీజర్ కారణంగా సినిమాపై అంచనాలు అంతకందుకు తగ్గుతూ వస్తున్నాయి. దానికి కారణం నాసిరకమైన గ్రాఫిక్ ఎఫెక్ట్స్.. భారీ బడ్జెట్లో నిర్మించిన నాణ్యత కరువైందని సినిమా విజువల్ ఎఫెక్ట్.. బాహుబలి, కల్కి రేంజ్ లో ఉంటాయని ఊహించిన కనీసం సెకండ్ గ్రేడ్ హీరో సినిమాకు ఉండే క్వాలిటీ కూడా మెగాస్టార్ విశ్వంభరకు లేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మెగాస్టార్కు ఇంకా ట్రైలర్‌తో మంచి అవకాశం ఉంది. ఇక్కడ మెరుగైన గ్రాఫిక్స్‌తో సినిమాపై నమ్మకాన్ని కల్పిస్తే ఖచ్చితంగా ఈ సినిమా పై ఆడియన్స్ కు ఆసక్తి నెలకొంటుందని చెప్పడంలో సందేహం లేదు. లేదంటే మరోసారి మెగాస్టార్ కెరీర్‌లో డిజాస్టర్ తప్పదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఒక బ్రహ్మ రాక్షసుడు.. భూమిపై ఉండే చిన్నపిల్లలను.. స్వర్గలోకంలో ఉండే దేవకన్యలను ఎత్తుకొని పోతాడట. అలా చిరంజీవి సోదరి కూతుర్ని ఆ రాక్షసుడు ఎత్తుకొని పోతుండగా.. ఆ చిన్నారిని వెతుక్కుంటూ చిరంజీవి తన జర్ని కొనసాగిస్తాడని తెలుస్తుంది.
అతనికి ఆంజనేయస్వామి అండ ఉంటుందట. అలా స్వామి అనుగ్రహంతో చిన్నారి కోసం మూడు లోకల్ ప్రయాణాన్ని కొనసాగించిన చిరు.. ఈ క్రమంలో ఎంతో మంది రాక్షసులకు.. అలాగే ఒక దేవ కన్యను కూడా కలుస్తాడట. ఓ బ్రహ్మరాక్షసుడు నుంచి ఆ దేవకన్యను.. చిరు రక్షిస్తాడని ఈ క్రమంలోనే వారిద్దరి మధ్యన మంచి పరిచయం ఏర్పడుతుందని.. పరిచయం కాస్త ప్రేమగా మారుతుందని.. అంతేకాదు చిరుని గమ్యస్థానం చేరడానికి దేవ కన్య సహకరిస్తుందని తెలుస్తుంది. అయితే ఈ బ్రహ్మరాక్షసుడు చిన్న పిల్లలను, దేవకన్యలను అపహరించడానికి కారణమేంటి.. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి.. చిరుగా బ్రహ్మ రాక్షసులతో పోరాడి తన సోదరి బిడ్డను ఎలా కాపాడుకున్నాడు.. అనే అంశాలను మాత్రం అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారట మేకర్స్.
ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతుంది. అయితే డైరెక్టర్ గ్రాఫిక్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని మార్పులు చేర్పులతో ఆడియన్స్ ఆకట్టుకుంటే సినిమా సక్సెస్ సాధించడం ఖాయం అంటూ విశ్లేషకులు చెప్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ సరిగా లేదన్న కారణం ఇప్పటివరకు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించలేదని చెప్తున్నారు. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వియిదా పడినా కొత్త విడుదల తేదీని ప్రకటించకుండా ఇప్పటికీ బ్లాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వంభర రిలీజ్ డేట్ ఉగాదిలోనైన బయటకు వస్తుందో.. లేదో.. గ్రాఫిక్స్ ఎలా ఉండబోతుందనే టెన్షన్ ఫ్యాన్స్‌లో మొదలైంది. మెగాస్టార్ విశ్వంభర తో ఫ్యాన్స్‌కు ఆకట్టుకుంటాడి.. నిరాశ తప్పదా చూడాలి.