పెళ్లి వేడుకలో స్టార్ హీరోల భార్యలు సందడి.. ఇంతకీ ఎక్క‌డంటే..?

మాఘ‌మాసం రానే వచ్చేసింది. ఇక పూజలు, ఇళ్లల్లో శుభకార్యాలు మొదలైపోతాయి. ఇక వివాహ సాంప్రదాయానికి మాఘమాసం పెట్టింది పేరు. ఈ క్రమంలోనే వరుస పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మారుమోగిపోతున్నాయి. అలా తాజాగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల బంధువుల పెళ్లిళ్లు సైతం వరుసగా జరుగుతున్నాయి.

కాగా ఇటీవ‌ల‌ టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు అందరూ ఈ పెళ్లి వేడుకల్లో తళ్ళుక్కున మెరిసిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఎక్కడికక్కడే వైరల్ గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న బంధువుల వివాహంలో స్టార్ హీరో మహేష్ భార్య నమ్రత, వెంకటేష్ భార్య నీరజలు సందడి చేశారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, నమ్రత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక ఈ పెళ్లితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్.. తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, కళ్యాణ్ రామ్‌ల‌తో కలిసి కోనసీమ జిల్లాలోని గన్నవరం మండలం చాకలిపాలెం లోని ఓ వివాహ వేడుకలు పాల్గొన్నారు. అంతేకాదు.. మరో టాలీవుడ్ హీరో నితిన్ తన భార్యతో కలిసి హైదరాబాద్‌లోనే మరో పెళ్లి వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీల భార్యల ఫోటోలు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. మీరు ఓ లుక్ వేసేయండి.