టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది.. ఎప్పుడు పూర్తవుతుంది.. సినిమా కాస్టింగ్ వివరాలు.. ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. రాజమౌళి నుంచి ప్రాజెక్ట్ వస్తుంది అంటే చాలు అభిమానుల్లో ఆరాటం మొదలైపోతుంది. సినీ ప్రియులలో రాజమౌళి పేరు చెప్తే చాలు పూనకాలు స్టార్ట్ అవుతున్నాయి. అలాంటి.. రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో.. ముందు సినిమాలోని కొన్ని అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఆయన కూడా దానికి అవునన్న సమాధానం చెబుతారు. అయితే తాను తన సినిమాలో నుంచి స్ఫూర్తి పొందుతాను తప్ప.. ఎప్పుడూ ఇతర సినిమాల నుంచి స్ఫూర్తిగా తీసుకోలేదని వివరించారు.
ఇక తనను ఇన్స్పైర్ చేసే సీన్స్ ఎవరివైనా తాను రీ క్రియేట్ చేసేటప్పుడు.. తన స్టైల్ కచ్చితంగా అందులో ఉండేలా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. అంతకంటే ముందు స్ఫూర్తి కలిగించిన మేకర్స్‌కు తాను ట్రిబ్యూ ఇస్తానని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి.. ఇటీవల ఆస్కార్ అవార్డులు విజేతలుగా నిలిచిన అందరికీ విషెస్ తెలియజేశారు. అంతే కాదు ఈ ఏడాది బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్స్ క్యాటగిరిలో బ్రెజిల్ సినిమా ఐయామ్ స్టిల్ హియర్ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. ఈ సినిమా డైరెక్టర్ వాల్డర్స్‌కు రాజమౌళి ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు. దానికి కారణం ఇప్పటివరకు బ్రెజిల్ దేశానికి ఒక ఆస్కార్ అవార్డు కూడా రాలేదు.
అలాంటిది వాల్టర్ సెలెస్ తెరకెక్కించిన అయామ్ స్టిల్ హియర్ సినిమా అకాడమిక్ అవార్డ్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ గా సెలెక్ట్ కావడంతో.. బ్రెజిల్ దేశవాసులు హ్యాపీగా ఫీలవుతున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అంశాలతో ఓ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాజమౌళి కూడా అతని విష్ చేశాడు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇంతకుముందు రాజమౌళి సినిమా త్రిబుల్ ఆర్‌కు ఇప్పుడు బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న బ్రెజిల్ సినిమా డైరెక్టర్‌కు మధ్య ఓ లింక్ ఉంది. తన మాతృభాష త్రిబుల్ ఆర్ సినిమాకు రాజమౌళి తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నట్లే వాల్టర్ కూడా తన సొంత భాషతో అయామ్ స్టిల్ హియర్ బ్రెజిల్ కు మొట్టమొదటి ఆస్కార్ అవార్డును తెచ్చి పెట్టాడు.
అయితే ఇది అసలు లింక్ కాదు. త్రిబుల్ ఆర్ సినిమా తీయడానికి స్ఫూర్తి ఇచ్చినదే వాల్టర్ సోలన్ సినిమానేనట. ఎస్ మీరు వింటున్నది కరెక్టే.. 2004లో వాల్టర్ తెరకెక్కించిన ద మోటార్ సైకిల్ డైరీస్ సినిమాను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా ప్రేరణతోనే తెలుగులో డైరెక్టర్ క్రిష్ తన తొలి మూవీ గమ్యం సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. రాజమౌళి కూడా ద మోటర్ సైకిల్ డైరీస్ సినిమా ఎంతగానో మెప్పించిందని.. ఆ సినిమాను ప్రఖ్యాత పోరాట యోధుడే చేగోవేరా జీవితంలోని అంశాలతో ఓల్టర్ తెరకెక్కించాడని వివరించాడు. ఆ సినిమా చూశాక రాజమౌళికి కూడా మన దేశానికి చెందిన అమరవీరుల గాధతో ఇద్దరు మిత్రులు నేపథ్యంలో సినిమా తీయాలని ఆలోచన వచ్చిందని.. ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ట్రిపుల్ ఆర్. అందుకే.. తనకు స్ఫూర్తినిచ్చిన డైరెక్టర్ ఓల్టర్ సినిమాకు ఆస్కార్ రావడంతో రాజమౌళి ఆనందాన్ని వ్యక్తం చేశారట.