ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన రాగానే టక్కున.. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ పేర్లు వినిపిస్తాయి. ఇప్పటికే ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్ తమ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. జనాలను తమ సినిమాతో ఎంటర్టైన్ చేసే ఈ ముగ్గురు డైరెక్టర్స్.. ఎలాగైనా సక్సెస్ సాధించేందుకు ఎంత కష్టమైనా పడతారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమాలన్నీ ఎలాంటి సక్సెస్‌లు అందుకున్నాయో ఎంత క్రేజీ రికార్డులు బద్దలు కొట్టాయో చూసాం.
ఇక ఆయన తర్వాత ప్రశాంత్ నీల్‌పేరే వినిపిస్తోంది. తెరకెక్కించినది అతి తక్కువ సినిమాలైనా.. ప్రతి సినిమాతోను సంచలనం సృష్టించాడు ప్రశాంత్. ఇక.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా వచ్చిన పుష్ప సిరీస్‌లతో హిస్టరీ క్రియేట్ చేశాడో తెలిసిందే. పుష్ప 2తో సాలిడ్ హీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సుకుమార్. అలాంటి ఈ ముగ్గురి తోపు డైరెక్టర్స్ నచ్చిన ఏకైక హీరో ఒకరే అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.
ఇంతకీ ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్లను అంతలా ఆకట్టుకున్న హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. ఎస్.. ఇదే న్యూస్ ఇప్పుడు నెటింట ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ ముగ్గురు స్టార్ట్ డైరెక్టర్లు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ముగ్గురు రకరకాల సందర్భాల్లో తమకు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టమని.. ఇప్పుడు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన మెపిస్తుందంటూ వెల్లడించారు.