టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతో అంతకంతకు సక్సెస్ రేట్‌ను పెంచుకుంటూ వెళ్తున్న జక్కన్న.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే.. ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా పూర్తి అయిన తర్వాత.. ఆయన తన కెరీర్‌లో మరో భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని టాక్ నడుస్తుంది. ఇప్పటికి ఆయన చేసిన ప్రతి సినిమాకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడుతుంది. గతంలో మల్టీస్టారర్ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టించాడో.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలోనే ఆయన మరోసారర్ ఆర్ఆర్ఆర్‌ను మించి పోయే రేంజ్‌లో మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
ఇక ఇప్పటివరకు రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలలో అల్లు అర్జున్‌తో ఒక్క సినిమాను కూడా తెరకెక్కించలేదు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో పాటు.. మరో తమిళ్ తోపు స్టార్ హీరోను పెట్టి.. ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని.. మహేష్ బాబు సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా పనులు మొదలుపెట్టనున్నాడని సమాచారం. కథ బాధ్యతలను జక్కన్న విజయేంద్ర ప్రసాద్కు అప్పగించారని.. ఇదే పనిలో ఆయన బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ వార్తల వాస్తవం ఎంత తెలియదు కానీ.. నిజంగానే అల్లు అర్జున్ రాజమౌళి కాంబోలో ఓ సినిమా తెరకెక్కితే మాత్రం.. ఆ మూవీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేయడం ఖాయం అనడంలో అతిశయోక్తి లేదు.