బాలయ్య సినిమాల్లో మెగాస్టార్ ఫేవరెట్ ఏదో తెలుసా.. నందమూరి ఫ్యాన్స్‌కు కూడా ఫేవరెట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్న సీనియర్ స్టార్ హీరోస్ బాలకృష్ణ, చిరంజీవిలకు తెలుగు ఆడియోన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుపదుల వయసు మీద పడుతున్నా.. ఈ ఇద్దరు స్టార్ హీరోస్ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరు స్టార్ హీరోలు సినిమాల పరంగా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ సక్సెస్లు అందుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో అభిమానులు మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ.. కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

Chiranjeevi-Balakrishna's rare photos go viral after Chiru conveyed magical birthday wishes to Balayya - IBTimes India

అయితే ఇద్దరు సీనియర్ హీరోలు మాత్రం ఎప్పుడు సినిమాల విషయంలో గట్టి పోటీ ఇచ్చుకున్నా.. పర్సనల్ విషయంలో మాత్రం మంచి స్నేహితులుగా ఉంటారు. ఒకరికి సంబంధించిన ఈవెంట్లలో మరొకరు సందడి చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో నందమూరి నట‌సింహం బాలయ్య నటించిన సినిమాలలో మెగాస్టార్ ఫేవరెట్ మూవీ ఇదే అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చిన.. ఎన్ని ఇండస్ట్రియల్ హిట్లుగా నిలిచిన కొన్ని సినిమాలు మాత్రమే.. ఎప్పటికీ ఆడియన్స్‌ హృదయాల్లో నిలిచిపోతాయి. ఆ సినిమాలో రిలీజ్ అయ్యి ఎన్నేళ్లు గడిచిపోయినా.. పదేపదే ఆ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతూనే ఉంటారు.

Samarasimha Reddy

అలాంటి సినిమాలలో బాలయ్య నటించిన సమరసింహారెడ్డి మూవీ కూడా ఒకటి. దాదాపు 90 శాతం నందమూరి అభిమానులకు బాలయ్య సమరసింహారెడ్డి ఫేవరెట్ మూవీ. ఈ సినిమా బాలయ్య కెరీర్‌ను మలుపు తిప్పింది. చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ సినిమాగా నిలిచిపోయింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే విష‌యాని షేర్ చేసుకున్నాడు. బాలయ్య నటించిన అన్ని సినిమాల్లో తాను పదేపదే ఇంట్రెస్టింగ్గా చూసే సినిమా స‌మ‌ర‌సింహా రెడ్డి అంటూ.. ఎప్పటికీ ఈ మూవీ టాప్ ప్లేస్‌లోనే ఉంటుందంటూ వివరించాడు. అయితే చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ మరోసారి వైరల్ గా మారుతున్నాయి.