బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఛావా కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ఆడియన్స్‌ను అదే రేంజ్‌లో అకట్టుకుంటూ.. నిర్మాతలకు వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డాక్టర్ విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ విపరీతమైన హైప్ నెలకొంది.
ఈ క్రమంలోనే తెలుగులో ఛావా రిలీజ్ కోసం చాలామంది ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. మేకర్స్ సైతం.. ఛావాను తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. ఇక్కడ కూడా.. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ అంత భావించారు. కానీ.. సినిమా రిలీజ్‌కి ముందే ఊహించని విధంగా షాక్ తగిలిందని.. రిలీజ్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్.. నెల్లూరు జిల్లాలో ఈ సినిమా తెలుగు రిలీజ్ ని ఆపివేయాలంటూ ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్.. మహమ్మద్ జియా ఫుల్ హాకీ అక్కడ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించాడట.
ఛావా తెలుగులో రిలీజ్ అయితే మాత్రం ఘర్షణలు జరగడం ఖాయమని.. ఈ సినిమా చరిత్రకు సంబంధం లేకుండా తర్కెక్కించారని.. 16వ శతాబ్దం నాటి ఔరంగాజేబు క్యారెక్టర్ ని కౄరుడిగా ఈ సినిమాలో చూపించారని.. వారు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఉత్తర భారతంలో జరిగినట్టే ఇక్కడ కూడా వివాదాలు జరిగే అవకాశం ఉందని.. దయచేసి ఛావా.. తెలుగు రిలీజ్ ను ఆపేయాలని వారు కోరుతూ వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. మరి.. ఛావా మూవీ రిలీజ్ విషయంలో ఫైనల్ డెసిషన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.