టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరోగా రాణిస్తున్న తారక్.. చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు మొదట మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ వార్ 2 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ 90% పూర్తయిందని.. షూట్ తుది దశకు చేరుకుందంటూ సమాచారం. ఇక.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. అయితే తాజాగా.. ఈ ప్రాజెక్టు గురించి మూవీ ప్రొడ్యూసర్ మైత్రి రవి శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు చెప్పకనే చెప్పేశాడు. అయితే.. కొద్ది రోజుల క్రితమే డ్రాగన్ సినిమా షూట్ ప్రశాంత్ నీల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. సెట్స్‌లో ఎన్టీఆర్.. వీలైనంత త్వరగా అడుగుపెట్టి సినిమాను వేగంగా పూర్తి చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దానికి కారణం ఎన్టీఆర్ లైనప్‌లో ఉన్న మరో మూవీ.. దేవర 2 అని తెలుస్తుంది. డ్రాగెన్ వెంటనే పూర్తి చేసి.. దేవర 2 సినిమాను స్టార్ట్ చేసేయాలని కంగారు పడిపోతున్నాడట ఎన్టీఆర్. ఈ క్రమంలోనే డ్రాగెన్ త్వరగా పూర్తిచేయాలని ఈ ఏడాది చివరి కల్లా దేవర 2 కూడా సెట్స్ పైకి వచ్చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే దర్శకులకు కావలసిన సమయం ఇవ్వకుండా.. ఎన్టీఆర్ కంగారు పెడితే అనుకున్న ప్రాజెక్ట్ తెరపైకి వచ్చేటప్పటికి.. క్వాలిటీ లోపాలతో మరిన్ని సమస్యలతో.. మూవీకి నెగటివ్ టాక్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాకు అయితే.. కచ్చితంగా అదే రేంజ్ లో హీటర్స్ ఉంటారు. దీంతో మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దేవర 2 విషయంలో పడుతున్న కంగారు చూసి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ఎందుకింత కంగారు పడుతున్నారు.. ఏం జరుగుతుంది.. అసలు ఆయన కెరియర్ ప్లానింగ్ ఏమై ఉంటుంది అంటూ రకరకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు ముందు ఆయన సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు.. ఫ్యాన్స్‌ను నిరాశపరచకుండా సరైన అవుట్‌పుట్ ఇస్తాడా.. లేదా.. వేచి చూడాలి. ఇక డైరెక్టర్ కొరట్టాల ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ పూర్తి చేసినట్లు టాక్ నడుస్తుంది.