టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఫుల్ ఫార్మ్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైథాలాజికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. అంతేకాదు బన్నీ.. అట్లీ డైరెక్షన్లో మరో సినిమాను నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇలాంటి క్రమంలో బన్నీ – అట్లీ కాంబోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో ఏకంగా అల్లు అర్జున్ సరసన ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఒక్క సినిమాలో ఐదుగురు హీరోయిన్లతో నటించడం అంటే.. అది నార్మల్ విషయం కాదు. ఇక ఈ కాంబోలో జాన్వి కపూర్ మెయిన్ హీరోయిన్‌గా మెరుస్తుండగా.. మిగతా నలుగురు విదేశీ హీరోయిన్లను కూడా అట్లీ ఇప్పటికే బన్నీతో రొమాన్స్‌కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. జవాన్ సినిమాతో సక్సెస్ అందుకున్న అట్లీ.. తన నెక్స్ట్ సినిమాతో అదే రేంజ్లో సక్సెస్ అందుకోవాలని కసితో ఉన్నాడు.
ఈ క్రమంలోనే.. బన్నీ కోసం పక్క ప్లాన్ తో పర్ఫెక్ట్ కాన్సెప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి క్రమంలో బన్నీ రూ.200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే నిర్మాతలు కూడా కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంది. అయితే.. ఆయన క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో.. బన్నీ ఈ సినిమాతో కచ్చితంగా పాన్ ఇండియా రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క బన్నీ సరసన నటించనున్న జాన్వి కపూర్.. ఇప్పటివరకు చేసిన సినిమాలు కూడా వరుసగా హిట్లుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ సినిమాలో ప్లానింగ్ ఎలా ఉందో వేచి చూడాలి.