మ‌ళ్లీ ప్రేమలో ప‌డిన స‌మంత‌… రియాక్ష‌న్ చూస్తే త‌ట్టుకోలేం…!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత దాదాపు ద‌శాబ్ధ‌కాలం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్‌ చేసి పడేసింది. అయినా అమ్మడి క్రేజ్ ఈ రేంజ్‌లో ఉండేది కాదు. కానీ.. నాగచైతన్యతో విడాకుల తర్వాత మాత్రం సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఎప్పుడు సమంత పేరు వినిపిస్తూనే ఉంది. వీరి విడాకుల తర్వాత వీరికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చిన ఆడియన్స్ ఆసక్తిగా దానిని వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికి వీళ్ళ పేర్లు వైరల్ అవుతూనే ఉన్నాయి.

Samantha Ruth Prabhu adds disclaimer to podcast video after spat with The  Liver Doc

తాజాగా నాగచైతన్య.. ప్రముఖ స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత 2వసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడితో ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. వారు ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ టాక్‌ కూడా నడిచింది. అయితే.. రీసెంట్గా ప్రముఖ నేషనల్ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత.. దీనిపై రియాక్ట్ అయింది. నేను నా లైఫ్ లో మరోసారి ప్రేమలో పడాల‌ని అనుకోవడం లేదు.. ఇకపై దాని గురించి చర్చించడానికి కూడా నేను సిద్ధంగా లేను. లవ్ అనేది నా పర్సనల్. దాన్ని పర్సనల్ గానే ఉంచుతా అంటూ వివరించింది.

Samantha Ruth Prabhu Hot and Sexy Photo Collection

ప్రస్తుతం సమంత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే సమంత గ‌త‌ ఏడాది కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ కచ్చితంగా నేను సింగిల్ గా అయితే ఉండను అంటూ వివరించింది. అప్పుడు అలా మాట్లాడిన ఆమె.. ఇప్పుడు ఎందుకు ఇంతలా మారిపోయింది. ఈ గ్యాప్ లోనే ఆమెకు ప్రేమపై అంతలా విరక్తి ఎందుకు కలిగింది.. అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే సమంత అభిమానులు మాత్రం పెళ్లికి తాను సిద్ధమేనని.. కానీ పెళ్ళికి ముందు ప్రేమ, డేటింగ్ లాంటిది చేసే ఓపిక లేదని ఆమె మాటల్లో దాగి ఉన్న ఉద్దేశం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సమంత గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువగా సినిమాలను ఎంచుకున్న నటిస్తుంది. అంతేకాదు తన సొంత బ్యానర్ స్థాపించి.. నిర్మాతగా తానే ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలోని నటిస్తోంది.