టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి షూటింగ్ స్పీడ్‌గా పూర్తి చేసి రిలీజ్ చేస్తాడని అంత భావించారు. కానీ.. ఇప్పటివరకు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అసలు అనౌన్స్ చేసింది లేదు. ప్రస్తుతం ఫారన్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ లోనూ అసలు అల్లు అర్జున్ కు ఏమైంది.. స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది.. మెడికేషన్ కూడా మార్చేశారు.. కోలుకునేందుకు టైం కావాలని చెప్తున్నాడు.. అసలు ఎందుకు ఈ ట్రీట్‌మెంట్ అనే సందేహాలు మొదలయ్యాయి.
అయితే ఈ ప్రశ్నలకు తాజాగా అందుతున్న సమాధానం.. పుష్ప రాజ్ సినిమా. పుష్ప 2 బన్నీకి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చినా.. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ముఖ్యంగా ఓ మహిళ చనిపోవడం, పిల్లాడు ఐసియూలో లైఫ్ తో ఇప్పటికీ పోరాడుతూ ఉండడం ఆయనను వెంటాడుతూనే ఉందని.. మానసికంగా ఈ విషయాన్ని ఆలోచిస్తూ నలిగిపోతున్నాడని చెబుతున్నారు. ఓ పక్కన జనం ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ ఎటాక్.. మరోవైపు పొలిటికల్ గాను వ్యతిరేకత వీటన్నింటి స్ట్రెస్ ను భరించలేక దూరంగా రికవరీ అయ్యేందుకు ఫారన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత తెలియదు కానీ.. పూర్తిగా దీన్ని అబద్ధం అనుకోవడానికి కూడా లేదు.
కారణం.. ఇప్పటికే త్రివిక్రమ్ బన్ని కోసం కథ కూడా పూర్తి చేశారు. ఆయన ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మాత్రం వెయిట్ చేస్తున్నాడు. అట్లీతోనో సినిమా ఓకే అయింది. కానీ.. సినిమాపై ఒక అప్డేట్ ను కూడా రివీల్ చేయడం లేదు. ఇక అల్లు అర్జున్ కోసం అట్లీ ఇప్పటికే ఐదుగురు హీరోయిన్లను కూడా సిద్ధం చేశాడని టాక్. ఇంతలో బన్నీ విదేశాలకు చికిత్స కోసం మరోసారి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే యూరప్ లో ఉన్న ఓ వెల్‌నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే మెడిటేషన్ తో పాటు.. వర్క్ అవుట్ లు కూడా పూర్తి చేస్తున్న బన్ని ఇదంతా మానసికంగా తనని తాను స్ట్రాంగ్ గా మార్చుకోవడం కోసమే చేశాడని తెలుస్తుంది.
అయితే అలా వెళ్లి వచ్చిన వెంటనే.. మళ్ళీ ఇంకో ఫారన్ ట్రిప్పు.. అది కూడా సోలో ట్రిప్ కే ప్లాన్ చేస్తున్నాడట. అట్లీ మాత్రం బన్నీ సినిమా కోసం అదిరిపోయే కాన్సెప్ట్‌తో పాటు.. ఏకంగా ఐదుగురు హీరోయిన్లను ఫిక్స్ చేశాడు. ఇలాంటి క్రమంలో ఈనెల సెకండ్ వీక్ నుంచి ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు బన్నీ జపాన్లోనే ఉండబోతున్నాడట బన్నీ. అక్కడ తాను సైకాలజిస్ట్‌ను కలిసి.. మెడిటేషన్ పద్ధతులను, మానసికంగా తనని తాను హీల్ చేసుకున్నందుకు వెళ్లబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఏంటో తెలియాలంటే మాత్రం అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.