వార్ 2 బిగ్ స‌ర్‌ప్రైజ్‌.. మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వేశారే…!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. దేవర సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ సినిమా తుది ద‌శ‌కు చేరుకున్నట్లు సమాచారం. అయితే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుందని.. సినిమాలో అత్యంత భారీ యాక్షన్ ఫైట్ సీన్స్ ఉంటాయని ఆడియన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. కాగా ఈ సినిమాలో ఆడియన్స్‌ను థ్రిల్ చేసేందుకు అంతకు మించిన ట్విస్టులు ఎన్నో ఉన్నాయని.. సినిమాను పీక్స్ లెవెల్ లో ప్రమోట్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే మూవీలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారట మేకర్స్.

ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం. చివరిగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్.. బాలీవుడ్‌లో అక్కడ భారీ కలెక్షన్లు కల్లగొట్టి మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇక అంతకంటే ముందే వచ్చిన త్రిబుల్ ఆర్.. దేవరకు బాగా కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే వార్ 2తో మరింత మార్కెట్ పెంచుకోవాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ బిగ్‌ అప్డేట్ వైరల్ గా మారింది. వార్ 2 షూటింగ్ సరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తారక్, హృతిక్ రోషన్ పై వచ్చే సోలో సీన్స్ అన్ని పూర్తి చేసిన డైరెక్టర్.. తాజాగా ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా ముగించేశారు. క్లైమాక్స్‌లో తారక్, హృతిక్‌ మధ్యన వచ్చే యాక్షన్స్ నెవ‌ర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుంద‌ని టాక్.

Hrithik Roshan & Jr NTR's Epic Dance-Off in War 2 | Behind the Scenes | Ayan Mukerji | Kiara Advani

ఇక‌ యాక్షన్ పార్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందట. అంతేకాదు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ కూడా ప్లాన్ చేస్తున్నారని.. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన నాటు నాటు సాంగ్ మించిపోయే లెవెల్లో ఈ డ్యాన్స్ నెంబర్ ఉండబోతుందని సమాచారం. ఇక మొబైల్లోని య‌ష్ రాజ్ ఫిలింస్‌ స్టూడియోలో 500 మంది డ్యాన్సర్లతో.. ఇద్దరు హీరోలపై ఈ పాటను ప్లాన్ చేస్తున్నారు. ఇక వాటిలో యాక్షన్ సీన్స్‌తోపాటు.. డ్యాన్సులు అంతకుమించి పీక్స్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్‌. ఇద్దరు ఇండియ‌న్‌ బెస్ట్ డాన్సర్స్ తమ ప్రాజెక్టులో ఉన్నప్పుడు దానిని క్యాష్ చేసుకోకుండా మేకర్స్‌ ఎలా ఉంటారు. ఈ క్ర‌మంలోనే డ్యాన్స్ నెంబర్‌తో ఆడియన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇక ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.