టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా సినిమాకు సంబంధించిన రకరకాల వార్తలను నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక గతంలో ఈ సినిమాలో మలయాళ నటుడు పృధ్విరాజ్ కీలకపాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ కూడా ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే తాజాగా.. మహేష్, పృధ్విరాజ్‌కు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ వైరల్ అవ్వడంతో దీనిపై మరింత క్లారిటీ వచ్చింది. పృధ్వీరాజ్ సినిమాలో ఫిక్స్ అయిపోయాడు అని అర్థమవుతుంది. ఈ ఫోటోలో మహేష్ తో పాటు.. పృథ్వీరాజ్ పోలీస్ పోలీసులకు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. ఒడిశాలో ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభం కానుందని సమాచారం. ఈ క్రమంలోని ఇద్దరు ఇప్పటికే ఒడిశాకు చేరుకున్నట్లు తెలుస్తుంది.
ఈ భారీ ప్రాజెక్ట్ అడవి నేపథ్యంలో సాగే కథ.. ప్రపంచాన్ని చుట్టే అడ్వెంచర్స్ జర్నీగా రూపొందనుందని తెలుస్తుంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడూ లేని విభిన్నమైన పాత్రలో సరికొత్త లుక్కుతో ఆకట్టుకొనున్నాడు.. ఇక ఈ సినిమాకు యమ్. యమ్. కీరవాణి సంగీత డైరెక్టర్గా వివరిస్తుండగా.. విజయేంద్రప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే.అంతేకాదు ఇందులో యూనివర్సల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో మెరువనుంది.