హాస్పిటల్ బెడ్ పై కదల్లేని స్థితిలో ప్రభాస్.. టెన్షన్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్‌తో రాణిస్తున్నాడో తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది స‌లార్‌, క‌ల్కి సినిమాలతో వచ్చి వరుసగా బ్లాక్ బ‌స్టర్లు అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్‌ సినిమా షూట్ 90% పూర్తి చేసిన‌ర టీం ఈ సినిమా ఈ ఏడాదిలో ఎలాగైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటే క‌ల్కీ 2, ఫౌజీ, స‌లార్ 2లో నటిస్తున్నాడు. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్‌ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఇలాంటి క్రమంలో ప్రభాస్ వ్యక్తిగత విషయం ఒకటి నటింట వైరల్ గా మారుతుంది.

ప్రభాస్ తీవ్ర గాయాలతో హాస్పటల్లో జాయిన్ అయ్యారని.. బెడ్ పై కదలని స్థితిలో ఉన్నాడంటూ న్యూస్ వినిపిస్తుంది. అసలు మేటర్ ఏంటంటే ప్రభాస్ తీవ్ర గాయాలతో ఇటలీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడట. మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకు జారీ పడిపోయాడని.. కాలుకు పెద్ద గాయమైందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయనను ఇటలీకి తీసుకువెళ్లి అక్కడ చికిత్స చేస్తున్నారని సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా ప్రభాస్ పిఆర్ టీం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీక్స్ అయితే వచ్చేసాయి. కాగా ఈ ప్రమాదం షూటింగ్ టైంలో జరిగిందా.. లేదా ప్రమాదవశాత్తు జరిగిందా.. అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు.

Prabhas joins Telangana anti-drug drive and urges youth to say no to drugs  - India Today

గతంలోనూ ప్రభాస్ బాహుబలి సెట్స్ లో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో ఆయన కాలుకు ఐరన్ రాడ్‌ కూడా వేశారు. అయితే తాజాగా జరిగిన ప్రమాదంలో మళ్లీ కాలికే గాయం కావడం.. ఆ ఐరన్ రాడ్ కూడా బ్రేకై సమస్య మరింత తీవ్రమైందని సమాచారం. న‌రాలు దారుణంగా దెబ్బతిన్నాయ‌ని.. దీంతో ఫిబ్రవరి 28న ఇటలీలోని అత్యంత ప్రాముఖ్యత పొందిన హాస్పిటల్ లో ప్రభాస్ కు సర్జరీ చేయించినట్లు టాక్ నడుస్తుంది. ఆరు నెలల పాటు ఆయన పూర్తి రెస్ట్ తీసుకోవాలని వైద్యులు వివరించారట. అయితే ప్రభాస్ అనారోగ్యం గురించి బయటకు రాకుండా టీం చాలా జాగ్రత్తలు పడుతున్న క్రమంలో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ప్రభాస్ ప్రస్తుతం ఎలా ఉన్నారో తెలియచేయాలంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.