నాని ” ది ప్యార‌డైజ్‌ ” మిస్ చేసుకున్న స్టార్ హీరో.. క‌నీసం డైరెక్ట‌ర్‌కు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేదా..!

ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా అతి కొద్ది మంది హీరోలు మాత్రమే కొత్త డైరెక్టర్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తుంటారు. చాలామంది స్టార్ హీరోస్.. కొత్త డైరెక్టర్లను సులువుగా నమ్మలేరు, కొత్త డైరెక్టర్లను నమ్మి ఆ ప్రాజెక్టుపై కాన్ఫిడెన్స్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. తమ స్టార్ స్టేటస్ లో రిస్క్ లో పెట్టడానికి భయపడుతూ ఉంటారు. ఈ విషయం స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించిన నటుల నెక్స్ట్ సినిమాల లిస్టు చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. అయితే నేచురల్ స్టార్ నాని, రవితేజ లాంటి హీరోలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త డైరెక్టర్ ను ఎంకరేజ్ చేస్తూ తమ నటనతోను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. రవితేజ కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం వల్లే ఇప్పుడు హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, బాబి, గోపీచంద్ మల్లినేని లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

Nani, Srikanth Odela's film titled 'The Paradise'

కానీ.. ఇటీవల కాలంలో రవితేజ కొత్త డైరెక్టర్ కు అవకాశాలు ఇవ్వడం వల్ల చాలా నష్టపోయాడు. అయితే నాని మాత్రం కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి మంచి సక్సెస్ లో అందుకుంటూ రాణిస్తున్నాడు. జెర్సీతో గౌతం తిన్న‌నూరి, దసరాతో శ్రీకాంత్ ఓద్దెల, శ్యాం సింగరాయ్‌తో రాహుల్.. ఇలా ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి ఇండస్ట్రీలో సంచలన సక్సెస్లు అందుకున్న నాని.. ముఖ్యంగా శ్రీకాంత్ ఓద్డెలతో దసరా లాంటి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌ సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సత్త‌ చాటుకున్న డైరెక్టర్స్‌లో ఒకరిగా శ్రీకాంత్ పేరు మారు మోగిపోయింది. ఇలాంటి క్రమంలో దసరా తర్వాత ఆయన నానితో ది పారడైజ్ లాంటి మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చారు.

Actor Surya appeals to students to be bold and confident – RITZ

ఈ సినిమా లింక్స్ తాజాగా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాన్సెప్ట్ కొంతమందికే అర్థమై.. మరి కొంతమందికి అర్థం కాకున్న విజివ‌ల్స్ అద్భుతంగా ఉందనే ఫీల్ మాత్రం వచ్చింది. అయితే శ్రీకాంత్ ఈ స్క్రిప్ట్ లో ఇప్పటికి ఇప్పుడైతే రాసుకోలేదట. దసరా సినిమా స్క్రిప్ ని రాస్తున్న రోజులను పూర్తయిందని.. నానికి దసరా సినిమా స్టోరీని వినిపించే కంటే ముందే ది పారడైజ్ సినిమాను తమిళ్ హీరో సూర్యకు వినిపించాలని ప్రయత్నం చేసినట్లు సమాచారం. సూర్య చుట్టూ ఉండే మనుషులు కనీసం శ్రీకాంత్ అపాయింట్మెంట్ కూడా ఇప్పించకుండా తెగ తిప్పించారట. మానసికంగా కృంగిపోయిన శ్రీకాంత్ ఇక సూర్య అపాయింట్మెంట్ కోసం తిరగడం మానేసాడట. అయితే ప్రస్తుతం సూర్య ఈ మూవీ గ్లింప్స్ చూస్తే మాత్రం ఎలాంటి సినిమాలు మిస్ అయ్యానని కచ్చితంగా ఫీల్ అవుతాడంటూ పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యకి చాలా కాలం నుంచి ఒక్క సరైనా సక్సెస్ కూడా రాలేదు. ఇలాంటి క్రమంలోనే సూర్య అభిమానుల సైతం తన నెక్స్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు.