యంగ్ బ్యూటీ శ్రీ లీల కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తెలుగు సీనియర్ స్టార్ హీరోలతో సైతం స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తుందని.. అతనితో ప్రేమలో పడింది అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనికి కారణం ఇటీవల అమ్మడు హీరోతో కలిసి అతని ఇంట్లో కనిపించడమే. నిజంగానే శ్రీలీల హీరోతో ప్రేమలో పడిందా.. అతనితో డేటింగ్ చేస్తుందా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే శ్రీ లీల ప్రేమలోపడిన ఆ హీరో ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరోయిన్గా తన సినీ కెరీర్ ప్రారంభించిన శ్రీ లీల తమిళ్, హిందీ భాషల్లోనూ రాణిస్తుంది. తమిళ్లో శివ కార్తికేయన్‌తో పరాశక్తి సినిమాలో నటించింది. అలాగే తెలుగులో నితిన్‌తో రాబిన్ హుడ్ సినిమాలోని మెరువనుంది. ఇక రవితేజ కూడా మరో సినిమాలో పనిచేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో ఆషికి 3 సినిమా చేస్తుంది. రీసెంట్గా సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ను టీం రిలీజ్ చేశారు. ఈ ప్రమోషనల్ కంటెంట్ వీడియోతో సినిమాపై ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గట్టుగానే శ్రీలీల హాట్ రొమాన్స్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.
అయితే తాజాగా శ్రీ లీల కార్తిక్ ఆర్యన్‌తో కలిసి చాలాసార్లు కనిపించడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా కార్తీక్ సోదరి కృతిక తివారి ఓ పార్టీని సెలబ్రేట్ చేసింది. ఆ పార్టీలో కార్తిక్ ఆర్యన్‌తో పాటు.. శ్రీలీల కూడా సందడి చేయడం మరింత అనుమానాలను రేకెత్తిస్తుంది. వీళ్లిద్దరికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెటింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే శ్రీ లీల డేటింగ్ వార్తలు నిజమే అయి ఉంటుందని చాలామంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంత మంది మాత్రం డేటింగ్ లేదు.. ఏమీ లేదు.. కలిసి నటించబోయే హీరోయిన్ కనుక ఆమెతో కాస్త క్లోజ్ గా ఉంటున్నాడు. తన సినిమా హీరో.. సోదరి ఇచ్చిన పార్టీ కాబట్టి అందులోనూ ఆమె పాల్గొంది. దీనికే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వార్తల్లో వాస్తవం ఎంతున్న ప్రస్తుతం మరోసారి శ్రీలీల డేటింగ్ వార్త హాట్ టాపిక్‌గా మారింది.