టాలీవుడ్ పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్య ఘటన కొద్ది గంటలుగా టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కల్పనకు.. భర్తతో జరిగిన గొడవల నేపథ్యంలో ఆమె మత్తు మాత్రలు మింగిందంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. రెండు రోజుల క్రితం భర్త ఆమెతో గొడవ కారణంగా ఇంట్లోంచి వెళ్లిపోయారని.. అప్పటినుంచి ఆమె కూడా డోర్ లాక్ చేసుకుని బయటకు రాలేదని స్థానికులు చెప్పినట్లు వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలోనే ఆమె భర్తతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. తన తల్లి కల్పన ఆత్మహత్య ప్రయత్నంపై కూతురు దయా ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. మా అమ్మ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పుకొచ్చింది. ఇక ఆమె మాట్లాడుతూ.. అమ్మ కల్పనా సింగర్ గా పనిచేస్తూనే.. మరో పక్క పీహెచ్డీ, ఎల్ఎల్‌బి చేస్తుందని.. దాని కారణంగా స్ట్రెస్‌కు గురవడంతో వైద్యులు ఇన్సోమియా టాబ్లెట్స్ సజెస్ట్ చేశారని వివరించింది.
టాబ్లెట్స్ కారణంగానే ఆమె అపస్మరక స్థితికి వెళ్లిందని చెప్పుకొచ్చింది. మా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని.. మా అమ్మ, నాన్న బాగానే ఉన్నారు. మేమంతా హ్యాపీ ఫ్యామిలీ. దయచేసి మీడియాలో అవాస్తవాలను ప్రచురించడం మానేయండి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తన తల్లి పరిస్థితి బాగానే ఉందని.. అమ్మ ఆరోగ్యంగా బయటకు వస్తుందంటూ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా కల్పనా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది హాస్పిటల్. వెంటిలెటర్స్ ని తొలగించిన వైద్యులు.. మరో 24 గంటల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వివరించారు.