టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం వరుస సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించను8న్నాడు తారక్. అంతేకాదు.. దేవర 2 సినిమా కూడా ఎన్టీఆర్ లైనప్‌లో ఉంది. కాగా ఎన్టీఆర్ పర్సనల్ విషయానికి వస్తే భార్య లక్ష్మీ ప్రణతితో పాటు.. కొడుకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు ఇండస్ట్రీ తో అసలు టచ్ లేకున్నా.. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్‌కు సంబంధించిన చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. వాటిలో తన ఫేవరెట్ ఫుడ్.. అలాగే ఫేవరెట్ హీరో.. ఇలా రకరకాల విషయాలు రివిల్ అయ్యాయి. ఇక భార్గవ్ రామ్‌కు మొదటి నుంచి ఫేవరెట్ ఫుడ్ పప్పన్నం అట. అంతేకాదు.. చాక్లెట్లు ఎక్కువగా తింటాడని.. నేతి అరిసెలు అంటే భార్గవ్ కు చాలా ఇష్టమని తెలుస్తుంది. అది కూడా వాళ్ళ నాన్నమ్మ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తాడని.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారుతుంది.
ఇక భార్గవ్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది అసలు ఊహించలేరు. జనరల్‌గా ఏ స్టార్ హీరో కొడుకు అయినా.. మొదట వాళ్ళ నాన్న ఫేవరెట్ హీరో అని చెప్తూ ఉంటారు. కానీ.. భార్గవ్ రామ్ కు మాత్రం తన ఫేవరెట్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్టం అట. ముఖ్యంగా పుష్ప సినిమా. ఇప్పటికే పుష్ప సినిమాను భార్గవ్ చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తాడట. అంతే కాదు సినిమాలో వచ్చే తగ్గేదెల డైలాగులు తన స్టైల్ లో చెప్తూ ముద్దు ముద్దుగా అల్లరి చేస్తూ ఉంటాడట.