ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. అట్లీ డైరెక్షన్‌లో ఓ ప్రాజెక్ట్ రూపొందనుందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. అయితే.. సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడనే సమాచారం మాత్రం ఈ నెలాఖరులో క్లారిటీ వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అట్లీ బిజీ అయినట్లు టాక్. ఇక బన్నీకి జోడిగా జాన్వి కపూర్ సినిమాల్లో హీరోయిన్గా కనిపించనుందట. ఇక స్టోరీ డిమాండ్ మేరకు మరికొంతమంది భామలు కూడా ఈ సినిమాలో సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా అట్లా విదేశాలకు వెళ్లి హంటింగ్ చేస్తునట్లు సమాచారం.
సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారని.. మెయిన్ లీడ్ గా జాన్వి కపూర్ ఉండగా.. మిగతా నలుగురు హీరోయిన్లు ఫారెన్ బ్యూటీలే అని చెబుతున్నారు. అమెరికన్, కొరియన్ భామల్ని ఈ సినిమా కోసం ఎంపిక చేస్తున్నాడట అట్లీ. ఇక ఈ ప్రాజెక్టులో పాన్ వరల్డ్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా.. విదేశీ బ్యూటీలకు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల అల్లు అర్జున్ విదేశాల్లో విహరిస్తున్న సంగతి తెలిసిందే అక్కడ తన నెక్స్ట్ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారంటూ టాక్ కూడా నడిచింది. కానీ.. ఈ ట్రైనింగ్ అట్లీ సినిమా కోసమి.. త్రివిక్రమ్ సినిమా కోసమా.. అన్న సందిగ్ధత అందరిలోనూ ఉంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అట్లీ సినిమా కోసం విదేశాలకు వెళ్లడని.. స్పెషల్ ట్రైనర్ల వద్దకు అట్లీ.. మన్నీని స్వయంగా పంపించినట్లు సమాచారం లీక్ అయింది. బన్నీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కాస్త డోస్ పెంచి అట్లీ హై ఆక్టేన్ స్క్రిప్ట్ రాసుకున్నాడట. బన్నీ జిమ్నాస్టిక్స్, మర్షల్ ఆర్ట్స్‌లో టచ్ ఉండటంతో.. ఈ నేపథ్యంలోనే బన్నీని ఆ యాంగిల్ లో బ్రీఫ్‌గా చూపించేలా స్క్రిప్ ను బిల్డ్ చేస్తున్నాడట అట్లీ. దానికి సంబంధించి విదేశాల్లో స్పెషల్ ట్రైనర్ వద్ద 30 రోజులు ట్రైనింగ్ ఇప్పించినట్లు సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది.