నాని ‘ ది పారడైజ్ ‘ ఆ హాలీవుడ్ సినిమాకు రీమేకా.. అడ్డంగా బుక్ అయిపోయారే..!

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త అంశాలను ఎంచుకుంటూ.. వైవిధ్యమైన కథలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు నాని. తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఈ నేచురల్ స్టార్.. ఒకప్పుడు పక్కింటి కుర్రాడి లాంటి పాత్రలను ఎంచుకుంటూ కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత మాస్ జోనర్‌లో సినిమాలు తీస్తూ కూడా మెప్పించాడు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్లో వచ్చిన దసరా సినిమాతో కెరీర్‌లో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అప్పటివరకు మీడియం రెండు మార్కెట్‌తో ఉన్న నాని.. ఈ సినిమాతో రూ.100 కోట్లు క్ల‌బ్‌లో చేరి సంచలనం సృష్టించాడు. ఇలాంటి నేప‌ద్యంలో తాజాగా వీరిద్దరి కాంబో మళ్లీ ఫిక్స్ అయింది.

The Paradise' teaser out: Fans laud 'Natural Star' Nani's looks in upcoming  film, say, 'This is a banger' | Mint

ది పారడైజ్ సినిమాతో వీరిద్దరూ మల్లి కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఎవరు ఆలోచన చేయని డిఫరెంట్ కాన్సెప్ట్.. కాకితో రూపొందించారు టీం. అయితే గ్లింప్స్‌తో మేకర్ చెప్పాలనుకున్నది కొందరికి అర్థమయిన.. కొందరికి అర్థం కాకపోయినా.. అందరూ అద్భుతమైన ఫీల్ కల్పించిందంటూ, మ్యాజిక్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా సినిమా ఓ హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రీమేక్గా తెర‌కెక్కనుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాలీవుడ్ సీట్ ఆఫ్ ది గాడ్ సినిమాను ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

CITY OF GOD

ది పారడైజ్ పాస్టర్‌తో పాటు.. ఈ పోస్టర్‌ని పక్కన పెట్టి పోల్చి చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఇక సీట్ అఫ్ ది గాడ్ మూవీ స్టోరీ.. అణ‌గారి వర్గాల నుంచి వచ్చిన యువకుడు.. పేదరికంపై పోరాటం చేసి వాళ్లకే నాయకుడిగా నిలవడం. అందుకు అతను ఎన్నో అసాంఘిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాడు. ఇక సినిమా చూసేందుకు అద్యంతం ఆసక్తిని కల్పిస్తూ ఉంటుంది. తెలంగాణలో కాకి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది బలగం సినిమా ద్వారా చూసాం. ఇప్పుడు ది పారడైజ్ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కనుక.. కాకి అనే అంశంతో ముఖ్యమైన సామాజిక అంశాన్ని అనుసంధానం చేసి తీర్చిదిద్దినట్లు టాక్ నడుస్తుంది. ఇక మార్చి 26న రిలీజ్ కానున్న‌ సినిమాపై ఇప్పటినుంచి ఆడియన్స్ లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. కేవలం ఇండియన్ భాషలోనే కాకుండా ఇత‌ర భాష‌లోను ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.