సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా కోసం హీరో, హీరోయిన్లను ఫిక్స్ చేసి.. అంతా ఓకే అనుకున చివరి నిమిషంలో ఆ హీరో లేదా హీరోయిన్‌ను తప్పించి మరొకరిని సినిమా కోసం తీసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఇక అలాంటి క్రమంలో సదరు హీరో లేదా, హీరోయిన్ మూవీ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు అదే సినిమాల్లో ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి ఒప్పుకోరు. కానీ.. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ఈ హీరోయిన్ మాత్రం ఓ హిట్ సినిమా కోసం మొదట తనను హీరోయిన్ గా చెప్పి తొలగించినా.. మళ్లీ అదే సినిమాలో ఐటెం సాంగ్‌ఖు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించింది.
అసలు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో.. ఆ మూవీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. 2013లో రామ్ లీలా సినిమా తెరకెక్కి ఇలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ హీరో, హీరోయిన్లుగా మెరిసిన సంగతి తెలిసిందే. కాగా.. మొదటి సినిమా కోసం ప్రియాంక చోప్రాన్ హీరోయిన్గా అనుకున్నారట. కానీ.. చివరి నిమిషంలో ఆమెను తప్పించి దీపికా పదుకొనేను సినిమా కోసం తీసుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమాలో డాన్స్ మెంబర్గా నటించేందుకు ప్రియాంక ఒప్పుకుంది. ఈ క్రమంలోని సినిమాలో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రా తల్లి మధు చూప్ర ఇంటర్వ్యూలో వెల్లడించింది. తను తన పేషెంట్లను చూసుకుంటున్నకు సమయంలోనే రామలీల డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలిని కలిసిందని చెప్పుకొచ్చింది.
ప్రియాంక తిరిగి వచ్చాక జరిగిన విషయాన్ని చెప్పిందని.. దర్శకుడితో మాట్లాడిన తర్వాత ప్రియాంక ఓ మంచి నిర్ణయం తీసుకుని ఉంటుందని ఆమె భావించానని చెప్పుకొచ్చింది. తర్వాత మేరీ కోమ్ సినిమాలో ప్రియాంకకు సంజయ్ అవకాశాన్ని ఇచ్చారంటూ వెల్లడించింది. ఇక బాజీరావు మస్తానీలో ప్రియాంక నటన గురించి మధు మాట్లాడుతూ.. కాశి భాయ్ పాత్రలో నటించడం చాలా కష్టమని.. అలాంటి పాత్రలోను ఆమె ఆకట్టుకుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక మధు చోప్ర కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. నిజంగా ప్రియాంక చోప్రా గ్రేట్ అని.. తన పాజిటివ్ థింకింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. కాదా ప్రస్తుతం ప్రియాంక ది బ్లఫ్ సినిమాతో పాటు.. హాలీవుడ్ యాక్షన్ కామెడీ హిట్స్ ఆఫ్ స్టేట్ లో కూడామెరవనుంది. దీంతోపాటు రాజమౌళి డైరెక్షన్ ఎస్ఎస్ఎంబి 29 లో కూడా హీరోయిన్ గా కనపడనుందని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.