ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఇండియాస్ రిచెస్ట్ హీరోయిన్.. రూ.4600 కోట్ల ఆస్తి అధిపతి.. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ఈమె ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. టాలీవుడ్‌లోనూ పలు సినిమాలో నటించి మెప్పించింది. ఒకప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నానటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం తెలుగు, హిందీలోనే కాదు.. తమిళ్, మలయాళ భాషల్లోనూ ప‌లు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో యాక్టివ్గా లేకపోయినా.. ఇప్పటికీ కోట్లు సంపాదిస్తూ సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఏకంగా రూ.4600 కోట్ల ఆస్తికి అధిపతిగా వ్యవహరిస్తూ ఇండియన్ రిచెస్ట్ హీరోయిన్గా ఇమేజ్ను దక్కించుకుంది. ఇంతకీ ఈ సీనియర్ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. అది కాస్త కష్టం లేండి మేమే చెప్పేస్తాం. తను మరెవరో కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మ జూహీ చావ్లా.

Birthday Special: Juhi Chawla's 90s Outfits We Can Wear In 2021 | HerZindagi

1984 లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 1986లో ధర్మేంద్ర, సన్నిడియోలు, శ్రీదేవి నటించిన సుల్తాన్‌తో బిగ్ స్క్రీన్‌కు పరిచయమైంది. సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన ఈ అమ్మడు.. తర్వాత రెండేళ్ల గ్యాప్ తో రొమాంటిక్ మూవీ ఖయామత్ సే ఖయామత్ సినిమాలో ఆక‌ట్టుకుంది. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అమ్మడి కెరీర్‌ను కీలక మలుపు తెప్పింది. సినిమా భారీ సక్సెస్ తో జూహీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. లూథర్, ఐనా, దర్ హమ్ హై రాహి, ప్యార్ కే ఇష్క్, దివానా మస్తానా, యేస్ బాస్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఆకట్టుకుంది. హిందీలో మాత్రమే కాదు తెలుగులోను నాగార్జున జంటగా పలు సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళం లో మోహన్ లాల్, మమ్ముట్టితో కలిసి మెరిసింది.

Juhi Chawla Jay Mehta Untold Love Story,'पैसों के लिए बुड्ढे से कर ली  शादी', जय मेहता से शादी करने पर जूही चावला को पड़े थे ताने, क्यों उम्र को  लेकर आज भी

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హైయ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న నటిగాను రాణించింది. ఇక 2000 సంవత్సరం నుంచి జుహీ హీరోయిన్ గా కాకుండా.. ఇతర పాత్రలో నటించడం ప్రారంభించింది. అంతేకాదు.. ఓ ప‌క్క‌ సినిమాల్లో రాణిస్తూనే.. మరో పక్క బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. రకరకాల బిజినెస్ లతో చేత నిండా సంపాదిస్తుంది. ఈ అమ్ముడు షారుఖ్ ఖాన్ ఆధ్వర్యంలోని ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ గ్రూపులో కో పౌండర్ గా వ్యవహరించింది. ఎస్ఆర్కె తో కలిసి ఐపీఎల్ క్రికెట్ టీం కోల్కత్తా నైట్ రైడర్స్ కో ఓనర్గా, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టి అన్ని విధాలా డబ్బులు సంపాదించింది. అంతేకాదు ఆమె భర్త జై మెహతా కు కూడా ముంబై, ఫోర్‌బందర్‌ల‌లో లగ్జరీ హౌస్‌లు ఎన్నో ఉన్నాయి. ముంబైలో గుస్టోసో, రూ డు లాబిన్ లాంటి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు కూడా ఈ జంటకు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. పలు నివేదికల ఆధారంగా జూహీ చావ్లా ఆస్తుల విలువ 4,600 కోట్లు అని తెలుస్తోంది.