సౌత్ స్టార్ డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ తిరుగులేని ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటి దక్కించుకున్న ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా సెట్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుని కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాపై ఆడియన్స్ లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో స్టార్ హీరోల ఫ్యాన్స్.. ఇతర స్టార్ హీరోలను, దర్శకులను నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నెగిటివ్ ట్రోల్స్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరోలకు.. ఫ్లాప్ అయితే మాత్రం దర్శకులదే బాధ్యత అంటూ వారి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి క్రమంలో తాజాగా ఫిలిం స్టూడెంట్స్ కోసం అక్కినేని అమల నిర్వహించిన ఓ ఈవెంట్లో ప్రశాంత్ నీల్ పాల్గొని సందడి చేశాడు. డైరెక్షన్ గురించి ఆయన మాట్లాడుతూ.. సినిమాను తీయడం వేరు.. చూడడం వేరు.. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుందంటూ చెప్పుకోచ్చాడు. 2014 ఉగ్రం సినిమాకు ముందు వరకు నేను చాలా సినిమాలు చూసా. అప్పట్లో ఆ సినిమాలు తీసిన డైరెక్టర్ అంతా చాలా బాడ్ డైరెక్టర్స్ అని నేను ఫీల్ అయ్యే వాడిని.. ఇండస్ట్రీలో నేను మార్పు తేవాలని తెగ ఆరాట పడిపోయేవాడిని.. కానీ ఒకసారి సెట్స్‌లోకి అడుగుపెట్టి.. షూటింగ్ ప్రారంభించిన తర్వాత కొంత భాగం పూర్తయ్యేసమయానికి నేను రీలైజ్ అయ్యా. ఆ కష్టమేంటో నాకు బాగా తెలిసొచ్చింది. నేను తీసింది కనీసం 10 మంది చూసిన చాలు అనే ఫీల్ కలిగింది. టెన్నిస్ లాంటి ఫిలిం మేకింగ్ ను.. క్రికెట్ల భావించాను. పరిశ్రమలో టీం వర్క్ కూడా ఉంటేనే సక్సెస్ వస్తుందని అర్థమైంది.
ఈ విషయాన్ని నేను ఆలస్యంగా తెలుసుకున్నా అంటూ వివరించాడు. కాగా ప్రస్తుతం ఈ కామెంట్స్‌ని ప్రశాంత్ నీల్ ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరోని ఉద్దేశించి చేశాడంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రశాంత్ నీల్‌పై ఓ స్టార్ హీరో ఇన్ డైరెక్ట్ గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొందరు డైరెక్టర్ ఒక్క సినిమా హిట్ అవ్వగానే.. మేము తోప్,తురుము అని ఫీల్ అయిపోతారు.. గర్వంతో, అహంకారంతో ఆటిట్యూడ్ చూపిస్తూ ఉంటారని.. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకే కాన్సెప్ట్ సినిమాలు తెరకెక్కించి సక్సెస్ కొట్టాలని ఆలోచనలోనే ఉంటారంటూ చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో ఆ స్టార్ హీరో చేసిన కామెంట్స్ ప్రశాంత్ నీల్‌ను ఉద్దేశించి చేసినవే అంటూ అందరూ మాట్లాడుకున్నారు. కానీ.. ప్రశాంత్ ఎప్పుడు తాను తీసే సినిమా సక్సెస్‌కు తనే కారణం అని చెప్పుకోలేదు. నేను ఏ సినిమా తెరకెక్కించిన.. సినిమా సక్సెస్ కు మాత్రం పూర్తి కారణం సినిమా టీం అని.. ఆయన వివరిస్తూ వచ్చాడు. టీం వర్క్ ఉంటేనే సినిమా సక్సెస్ సాధిస్తుందంటూ ప్రశాంత్ నీల్ మరోసారి స్టేజిపై చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.