సింగర్ కల్పన సూసైడ్‌కు కారణం భర్తేనా.. రెండు రోజులగా పరిస్థితి ఇదే..!

తాజాగా టాలీవుడ్ పాపులర్ సింగర్, డ‌వ్వింగ్ ఆర్టిస్ట్‌, న‌టి కల్పన ఆత్మహత్యయత్నం చేయడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. స్లీపింగ్ పిల్స్ వేసుకొని అపస్మార‌క స్థితిలోకి వెళుతున్న క్రమంలో స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వెంటనే ఆమె నివాస స్థలానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అయితే ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడంపై అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఇంతకీ కారణమేంటి.. అసలు ఆమె ఇలాంటి పని ఎందుకు చేసిందని రకరకాల ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాగా కల్పన భర్తతో కలిసి నిజాంపేటలోని తన ఇంట్లో నివాసం ఉంటుంది. గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి భ‌ర్త ఇంటి నుంచి వెళ్లిపోయారని.. అక్కడ స్థానికులు చెబుతున్నారు.

Renowned playback singer Kalpana Raghavendar attempts suicide | Filmfare.com

అంతేకాదు రెండు రోజుల నుంచి కల్పన కూడా ఇంటి డోర్ తీయకుండా లోపల ఉంటున్నారట, అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో,, అక్కడికి వచ్చి పోలీసులు డోర్ కొట్టగా ఎవరు డోర్ తీయలేదు. దీంతో పోలీసులు అనుమానంతో డోర్ పగల కొట్టి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనని చూసి వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అయితే ఆమె బెడ్ పై పడుకున్న పక్కనే కొన్ని టాబ్లెట్స్ ఉండడంతో.. అవి స్లీపింగ్ పీల్స్‌గా గుర్తించారు. ఇక‌ స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం.. భర్త కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఇంట్లో ఉండడం లేదని.. కల్పనా భర్త పై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు కల్పిన భర్త ప్రసాద్‌ణు అదుపులోకి తీసుకోగా అత‌ను కూడా అనుమానాస్పదంగా కనిపించడం, మీడియాకు మొహం చూపించడానికి ఇష్టపడకపోవడంతో అనుమానాలు మరింతగా పెరిగాయి.

Singer Kalpana: Playback Singer Kalpana on Ventilator Support After Suicide..

దీంతో సింగర్ కల్పన సూసైడ్‌కు కారణం భ‌ర్తే అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కల్పన భర్తని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆయన చెప్పే విషయాలను బట్టి కల్పన కేవలం రిఫ్రెష్మెంట్ కోసమే కొన్ని పీల్స్ వాడిందని.. కానీ అవి ఓవ‌ర్ డోస్‌ కావడంతో అలా జరిగి ఉంటుందని పోలీసులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి భర్త వెళ్లిపోవడం అప్పటి నుంచి కనీసం కల్పన ఫోన్ కూడా చేయకపోవడం.. భర్త ఫ్యామిలీ కూడా దాన్ని పట్టించకపోవడం.. కూడా కల్పన భర్త పై అనుమాన పడాల్సిన విషయమేనంటూ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం కల్పన స్పృహలోకి రాలేదు. అపస్మారక స్థితిలో ఉండడంతో డాక్టర్లు హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేయలేదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సూసైడ్ అటెంప్ట్‌కు భర్త పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముందు ముందు ఈ విషయంపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి. అయితే ఆమె సూసైడ్ అటెండ్ చేసిందని తెలిసిన క్షణాల్లోనే తోటి సింగర్స్ సునిత, శ్రీ‌కృష్ణ‌, గీతా మాధురి.. కల్పనను చూడడానికి హాస్పిటల్‌కు పరుగులు తీశారు.