కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తమిళ సినిమాలు గ్రాండ్గా తెలుగులోను రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకుంటున్నారు మేకర్స్. కాగా ప్రస్తుతం కార్తీ 2022లో వచ్చిన స్కై యాక్షన్ థ్రిల్లర్ మూవీ సర్దార్ కు సీక్వెల్‌గా సర్దార్ 2లో నటిస్తున్నారు. డైరెక్టర్ పి ఎస్ మిత్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా జరుగుతుంది.
ఇలాంటి క్రమంలో ఓ యాక్షన్స్ సీన్ రూపొందిస్తున క్రమంలో కార్తీ కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. మైసూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న క్రమంలో.. సర్దార్ 2 సెట్స్‌లో కార్తీకి గాయమైందట. దీంతో వెంటనే కార్తిని ఆసుపత్రికి తరలించారు మూవీ టీం. ఇక డాక్టర్లు ఆయనను వారం రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సినిమా షూట్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక వారం పాటు సినిమా షూట్ ను నిలిపివేశారు. దీంతో మైసూర్ నుంచి తిరిగి చెన్నైకి ప్రయాణమైనట్లు కోలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రాజీషా విజయన్, ఎస్‌జే సూర్య, మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ తదితరులు కీలక పాత్రలో మెరువనున్నారు. ఇక కార్తీ గాయపడిన విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అఫీషియల్ గా తెలియజేయాలని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.