ప్రియుడితో తమన్నా బ్రేకప్.. షాక్ లో ఫ్యాన్స్.. !

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకపటి టాలీవుడ్ స్టార్ హిరోయిన్‌గా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా ఇండ‌స్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతుంది. ప్రస్తుతం ఆడపదడపా తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మ‌డు.. మరో పక్క కోలివుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. చాలాకాలం అతనితో డేటింగ్ కొనసాగించింది.

లాస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌లో క‌లిసి న‌టించిన ఈ జంట‌.. షూట్ టైంలో ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌ల్లో ప‌డ్డారు. ఇక 2023లో ఓ ఈవెంట్లో విజయ్ వ‌ర్మ‌కు.. తనకు మధ్య ఉన్న రిలేషన్‌ను అఫీషియల్ గా ప్రకటించింది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో ప్రైవేట్ ఈవెంట్లలో, ట్రిప్స్ లో ఎంజాయ్ చేస్తూ మీడియా కంట పడ్డారు. ఈ ఫిక్స్ కూడా తెగ వైరల్ గా మారాయి. ఇలాంటి క్రమంలో లవ్ బ‌ర్డ్స్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కాగా.. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒక‌టి నెటింట‌ వైరల్ అవ్వడంతో.. ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ ఆ మేటర్ ఏంటో చెప్పలేదు కదా. వీళిద్ద‌రు బ్రేకప్ చెప్పుకుని విడిపోయార‌ట‌. కొన్ని రోజుల క్రిత‌మే విడిపోయిన ఈ జంట స్నేహితులుగా కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ప్రముఖ సంస్థ పింక్ విల్లా ఈ న్యూస్‌ ప్రచురించడంతో ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైర‌ల్‌గా మారుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట.. అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు.. కారణమేమై ఉంటుంది అనే సందేహాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడవుతున్నాయి. అయితే ఈ వార్త‌లో వాస్తవం ఎంతో తెలియాలంటే ఈ జంట రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.