ఆ మ్యాటర్‌లో రాంగోపాల్ వర్మను ఫాలో అవుతున్న ప్రశాంత్ వర్మ ..!

కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతూ ఉంటాడు. ఇక ఎప్పటికప్పుడు ఈ సంఘటన పై సినిమా తీయబోతున్న.. అంశంపై కథ రాస్తున్న.. త్వరలోనే సినిమా వ‌స్తుంద‌ని ప్రకటనలు ఇవ్వడమే కానీ.. వాటిని మెటీరియలైజ్ చేసి.. రిలీజ్ చేయ‌డంలో అల‌స్యం చేస్తునే ఉంటారు. ఇలా చాలా ప్రాజెక్ట్ కేవలం ప్రకటనకే పరిమితం అయ్యాయి. అతి కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్‌ను పలకరించాయి. అయితే.. ఇటీవల కాలంలో ఒక్క సరైన సక్సెస్ కూడా లేని రాంగోపాల్ వర్మ తాజాగా తన సినిమాలు తెర‌కెక్కించే స్టైలు మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడు.

మళ్ళీ పాత వర్మను నిద్రలేపి బ్లాక్ బస్టర్లు అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ.. తాజాగా రాంగోపాల్ వర్మనే ఫాలో అవుతున్నాడు యంగ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ ఫార్మా నుంచి కూడా ఇటీవల కాలంలో వరుస సినిమాల ప్రకటనలు రావడమే తప్ప.. ఒక్క సినిమా కూడా సెట్స్‌ పైకి వచ్చిందే లేదు. పూర్తయింది లేదు. రిషబ్ శెట్టితో.. జై హనుమాన్ ప్రకటించారు. అది జరిగి కొన్ని నెలలు గడుస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ మిన‌హ‌.. సినిమా నుంచి ఒక్క చిన్న ఆప్డేట్ కూడా రాలేదు. మరోపక్క రిషబ్ శెట్టి కాంతారా ఫ్రీక్వెన్ విషయంలో బిజీగా గ‌డుపుతున్నాడు. అతని కాన్సన్ట్రేషన్ అంతా ఫ్రీక్వెల్ పైనే ఉంచాడు. అలాంటి బిజీ హీరోను ప్రశాంత్ వర్మ ఎందుకు తీసుకున్నాడు. టాలీవుడ్ లో మరి హీరో లేరా అంటూ ఇప్పటికే విమర్శలు కురుస్తున్నాయి.

Prasanth Varma Meets Bollywood Star Hero For His Next! | Prasanth Varma  Meets Bollywood Star Hero For His Next

ఇలాంటి క్రమంలో జై హనుమాన్ అసలు రిలీజ్ ఎప్పుడు వస్తుందో అనేది కూడా క్లారిటీ లేదు. అంతేకాక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో మరో సినిమాకు అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. దానిపై తర్వాత ఇంకే అప్డేట్ కూడా రాలేదు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మను బాలయ్య స్కిప్ చేశాడంటూ ప్రచారం కూడా కొనసాగుతుంది. ఈ రెండు ప్రాజెక్టులతో పార్టీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ రావణాసుర అనే మైథాలజికల్ ప్రాజెక్టులు తెరకెక్కిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అసలు ఈ ప్రాజెక్టు ఉందా.. లేదా.. సినిమా రిలీజ్ అవుతుందా అనేదానిపై కూడా క్లారిటీ లేదు. ఇదే కాకుండా ప్రశాంత్ వర్మ యూనివర్సిటీ నుంచి మరికొన్ని సినిమాలు వస్తాయి అంటే ప్రశాంత్ వర్మ ప్రకటిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వ‌ర్మ లానే ప్రశాంత్ వర్మ కూడా ప్రకటనలు తప్ప పని కనిపించడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.