ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా మూవీ డ్రాగన్.. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా.. తెలుగులో టైటిల్ మార్చి మూవీ రిలీజ్ చేయడం వెనుక ఉన్న రీజన్ ఏంటో రివీలైంది. ఎన్టీఆర్‌తో.. ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. దానిపై నిన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ.. తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా సక్సెస్ మీట్లో మైత్రి రవిశంకర్.. ఎన్టీఆర్ – నీల్ సినిమా ప్రస్తావన రాగా ఈ డ్రాగన్ ని తక్కువ అంచనా వేయడం కాదు.. కానీ ఆ డ్రాగన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
అతిపెద్ద డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా అంతా చుట్టి వేస్తుంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అవుతుందని పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్టీఆర్‌ను డ్రాగన్ గా రచ్చ చేసేందుకు రాబోతున్నాడు. ఆ సినిమాను తాజాగా సెట్స్ పైకి తీసుకువచ్చిన ప్రశాంత్.. రెగ్యులర్ షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించిన మొదటి రోజు సెట్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు నీల్. క్షణాలలో ఆ పోస్ట్ తెగ వైరల్ గా మారింది.
ఇలాంటి క్రమంలో నిర్మాత రవి శంకర్ నుంచి ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ అనే క్లారిటీ రావడంతో.. ఆడియన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అంతేకాదు.. ఆయనా మాట్లాడుతూ డ్రాగన్ మూవీ సక్సెస్ కూడా ఈ సినిమాకు కలిసి వస్తుందని.. సో అలా ఎన్టీఆర్ డ్రాగన్ కి.. ప్రదీప్ రంగనాధన్ డ్రాగన్ సపోర్ట్ చేశాడు అంటూ వివరించాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో రానున్న ఈ సినిమా షూట్ తుది దశకు చేరుకుందట. షూట్ ప్రమోషన్స్ పనులన్నీ పూర్తయిన వెంటనే.. డ్రాగన్ సినిమా సెట్ లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టనున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో పాటు.. వార్ 2పై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.