ఛాన్స్‌లు లేక నెల జీతానికి పనిచేస్తున్న హీరోయిన్.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు.. ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. కొంతమంది అందం, టాలెంట్ ఉన్నా కూడా ఒకటి రెండు సినిమాలకే ఫెడవుట్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది వరుస ఫ్లాప్‌లు వ‌చ్చిన‌ కూడా సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే చివరకు తమ సత్తా చాటి స్టార్ సెలబ్రెటీలుగా రాణిస్తూ ఉంటారు. మరి కొంతమంది స్టార్ హీరో సినిమాల్లో నటించి సక్సెస్ అందుకున్న కూడా తర్వాత ఆఫర్స్ రాక ఇండస్ట్రీకి దూరమవుతారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే ముద్దుగుమ్మ కూడా ఇదే కోవాకు చెందుతుంది.

Prabhas | Rebel Telugu Movie Stills | Deeksha Seth | Tamanna |  Moviegalleri.net

తన మొదటి సినిమాలోనే అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రభాస్, అల్లుఅర్జున్ లాంటి పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోల సరస‌న నటించిన ఈ అమ్మడు.. అప్పట్లో పాపులర్ న‌టిగా ఎన్నో సినిమాల్లో మెప్పించింది. తర్వాత కూడా స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నా.. హిట్స్ లేక మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. ఇంతకీ ఈ అమ్మడు పేరు చెప్పలేదు కదా.. తనే యాక్ట్రెస్ దీక్ష సేత్. పేరు చెప్తే టక్కున గుర్తుకు రాకపోవచ్చు.. రెబల్ సినిమాలో ప్రభాస్ హీరోయిన్, వేద మూవీలో బన్నీ రిచ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం టక్కున కనిపెట్టేస్తారు.

Deeksha Seth Latest Photo Gallery | Tags: South Actress Deek… | Flickr

ఈ హీరోలతోనే కాదు.. తర్వాత చాలామంది స్టార్ హీరోలు సినిమాలను అవకాశాలు అందుకుంది. హిట్స్ లేకపోవడంతో సినిమాలకి గుడ్ బై చెప్పింది. చివరిగా 2012లో ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా సినిమాలో మెరిసిన దీక్ష.. తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. హిందీలోను ప‌లు సినిమాల్లో కనిపించింది. అయితే.. అక్కడ కూడా ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. తర్వాత కన్నడ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక్కడ హీరో దర్శన్ జంటగా జగ్గు భాయ్ సినిమాలో మెరిసింది. సినిమాలో అవకాశాన్ని ద‌క్కించుకోవడంతో లండన్‌కు వెళ్ళిపోయిన దీక్ష.. ప్రస్తుతం అక్కడ ఐటీ జాబ్ చేసుకుంటూ బిజీగా రాణిస్తుంది.