సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్స్ ఇలా ఎంతోమంది పలు సందర్భాల్లో ఈవెంట్‌లో హాజరవుతూ ఉంటారు. ఆ ఈవెంట్‌లో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు ఏదో సమాధానం చెప్పాలనుకుని ఇంకేదో రివీల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా నిర్మాత రవిశంకర్ కూడా ఇలాంటి పని చేశారు. రిటన్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్లో పాల్గొనే సందడి చేసిన ఆయన.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురుకాగా.. వాటిపై రియాక్ట్ అవుతూ సినిమా పేరు డ్రాగన్ అని చెప్పకనే చెప్పేసాడు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రూ.100 కోట్లు కొల్లగొట్టింది.
మరి ఎన్టీఆర్ – నీల్ సినిమాకు తమిళనాడు డిఫరెంట్ టైటిల్ ఏదైనా ఉంటుందా.. అనే ప్రశ్న ఎదురుకాగా దానికి సమాధానం ఇచ్చే క్రమంలో.. ఎన్టీఆర్ – నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ పెట్టిన విషయాన్ని రవిశంకర్ రివీల్ చేసేసాడు. ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ సినిమా హై వోల్టేజ్ మూవీ అని.. ఈ డ్రాగన్ కు, ఆ డ్రాగన్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటూ వివరించాడు. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఇంటర్నేషనల్ సినిమా అని.. ఈ డ్రాగన్ హిట్ అవడం చాలా హ్యాపీగా ఉంది.
నెక్స్ట్ మరింత పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇలా ఎక్సైజ్మెంట్లో చెప్పేశాడు కానీ.. ఎన్టీఆర్ – నీల్ సినిమా డ్రాగన్ అనే టైటిల్ ఎప్పుడో ఫిక్స్ చేసేసాడు. నిజానికి ఈ టైటిల్ ఎప్పటినుంచో ఫిక్స్ అయినా కూడా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఎప్పుడు బయటకు రానివ్వలేదు. కానీ.. రవిశంకర్ మాత్రం సినిమా గురించి మాట్లాడుతూ పూసుకున రివీల్ చేశాడు. ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్ సినిమా కథను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై ఎవ్వరు చూడలేదంటూ చెప్పిన ఆయన.. సినిమాపై పిచ్చ కాన్ఫిడెన్స్‌తో ఉన్నామని.. సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ వివరించాడు. దీంతో సినిమాపై ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.