ఈ ఏడది సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలిచింది. రీజినల్ గా ఇండస్ట్రియల్ హిట్గా మారటమే కాదు.. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో సత్తా చాటుకుంటుంది. ఎన్నో సంచలనాలకు క్యారఫ్ అడ్రస్ గా మారింది. అయితే తాజాగా ఓటీటీలోకి వచ్చి ఇక్కడ కూడా రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. కాగా థియేటర్లలో అధిక సెంటర్‌లలో 50 రోజుల లాంగ్ రన్ కంప్లీట్ చేసి సంచలనం సృష్టించింది.
ఒకప్పుడు థియేటర్లో 50 రోజులు 100 రోజులు ఆడటం అంటే ఎంతో గ్రాండ్ గా చెప్పుకునే వారు. కానీ.. ఇప్పుడు కేవలం సినిమాలో వసూళ్లు మాత్రమే చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో కలెక్షన్లతోపాటు.. 50 రోజులు సెంటర్స్ లో నిరంతరాయంగా ఆడిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇప్పటికీ ఏకంగా 90 సెంటర్స్ లో 50 డేస్ లాంగ్ రన్ను పూర్తి చేసుకోవడం విశేషం.
దీంతో అనిల్ రావిపూడి స్వయంగా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ.. ఇంత పెద్ద సక్సెస్ అందించిన తెలుగు ఆడియన్స్‌కు, తన సినిమా కోసం అండగా నిలబడ్డ డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. ఇందులో భాగంగానే.. హీరో వెంకటేష్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అలాగే.. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్‌కు కూడా స్పెషల్ విషెస్ తెలియజేసాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారుతుంది.
View this post on Instagram