టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ సినిమాలు తెరకెక్కించిన సుక్కు.. ముఖ్యంగా మెగా హీరోలకు తమ కెరీర్‌లోనే మర్చిపోలేని రేంజ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలను అందించాడు. సుకుమార్ పుణ్యమాంటు ఆర్య, రంగస్థలం, పుష్పాది రైజ్, పుష్ప 2 ది రూల్ లాంటి సంచలనాత్మక సినిమాలు మెగా ఫ్యామిలీ ఖాతాలో పడ్డాయి. ఇలా మెగా ఫ్యామిలీకి వరుస బ్లాక్ బస్టర్లు ఇస్తున్న సుకుమార్.. మెగా కుటుంబానికి యాంటీగా ఉన్నాడంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. అంతేకాదు సుకుమార్ పొలికల్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
సుక్కు తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. కాగా గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించి రికార్డు రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతుంది. అటు ఓటీటీలోను.. సినిమా భారీ వ్యూస్‌ను దక్కించుకుంటుంది. ఇక ప్రస్తుతం సుకుమార్.. రామ్‌చరణ్ 17వ సినిమాను తెరకెక్కించనున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఇలాంటి క్రమంలో సుకుమార్ రీసెంట్గా వైసీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన అవార్డుల వేడుకకు సుకుమార్ హాజరై సందడి చేశారు. ఇదే ఇప్పుడు హార్ట్ టాపిక్. గతంలో బన్నీ.. వైసీపీ నేతకు సపోర్ట్ చేస్తూ ఎన్నికల్లో ప్రచారం చేయడంతో దాదాపు మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడు.
ఇప్పుడు సుకుమార్ కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. సుకుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వట్లేదు కదా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సుకుమార్ ఇలా పార్టీ ఫంక్షన్లకు వెళ్లడం అందరికీ షాక్‌ను కలిగిస్తుంది. ఇలాంటి క్రమంలోనే గతంలో జరిగిన పరిణామాలు అన్నిటినీ కనెక్ట్ చేస్తూ.. సుకుమార్ కూడా వైసిపి పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడని పవన్ అభిమానులు మండిపడుతున్నారు. అయినా వైసీపీ తరఫున రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చరణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఆల్మోస్ట్ పూర్తయిందని సమాచారం. ఇక ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సన డైరెక్షన్లో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్లో సినిమా నటించనున్నాడు.